Advertisement
Google Ads BL

కిక్ ఇవ్వని మోడ్రెన్ అందాలు


సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి క్యూట్ గా, బ్యూటిఫుల్ గా, సింపుల్ గా దగ్గరైన మృణాల్ ఠాకూర్ ని.. ఆమె కట్టు, బొట్టుకి ప్రేక్షకులు బాగా ముగ్దులయ్యారు. లంగా ఓణీ, సారీస్ తో సింపుల్ గా చాలా అంటే చాలా అందంగా కనిపించింది. ఆ చిత్రంతో తమిళ, మలయాళ, హిందీ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే సీతారామంలో అంత ట్రెడిషనల్ గా కనబడిన మృణాల్ తర్వాత హీట్ పెంచింది. గ్లామర్ చూపిస్తూ రెచ్చగొడుతోంది. అయితే బాలీవుడ్ నుండి వచ్చిన ఈ అమ్మాయి స్వతహాగా గ్లామర్ ఆరబోసే రకమే. కానీ ఆమె గ్లామర్ కన్నా అందాలనే ఆరాధించారు సౌత్ ప్రేక్షకులు. రీసెంట్ గా బాలీవుడ్ కల్చర్ లా బికినీ వేసింది.

Advertisement
CJ Advs

కానీ బికినీ లుక్ లో మృణాల్ అందాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మృణాల్ బికినీ గ్లామర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ చూపించారు ప్రేక్షకులు. ఆమె సంప్రదాయం ఉట్టిపడే లుక్ లో చూసాక ఇలాంటి మోడ్రెన్ అవతార్ లో చూడలేకపోయారు. కొంతమంది అందాలు ఆరబోస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తే అబ్బో అదిరింది అంటారు. కానీ మృణాల్ విషయంలో అలా జరగడం లేదు. మోడ్రెన్ లుక్ లో మృణాల్ అందాలు కిక్ ఇవ్వడం లేదు అంటూ పెదవి విరుపులు వినిపిస్తున్నాయి.

తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై డెబ్యూగా మెరిసిన మృణాల్ ఠాకూర్ అందాలు ఆరబోస్తూ మోడ్రెన్ వేర్ లో హొయలు పోయినా.. ఆమె అందాలను అంతగా పట్టించుకోవడమే లేదు. ఎందుకంటే ఆ గ్లామర్ లో బ్యూటీ కనిపించడం లేదు. అసలు మోడ్రెన్ డ్రెస్ మృణాల్ కి సెట్ అవదు అనేస్తున్నారు. ఆమె కట్టే సారీ లోనే ఆమె అందాలు అద్భుతంగా ఎక్స్పోజ్ అవుతాయంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Mixed response on Mrunal modern look:

Mrunal Thakur in modern outfits at Cannes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs