ఒకప్పుడు లక్కీ హీరోయిన్ గా కనిపించిన కృతి శెట్టికి ఇప్పుడు వరుసగా వైఫల్యాలు రాగానే ఆమె పనైపోయింది.. ప్రస్తుతం నాలుగు డిజాస్టర్స్ తో కృతి శెట్టి కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. ఇకపై కృతి శెట్టికి అవకాశాలు రావు అని మట్లాడుతూనే ఆమెపై సోషల్ మీడియాలో నెగిటివిటీని చూపిస్తున్నారు చాలామంది. ఈ మధ్యన కృతి శెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అని కూడా ప్రచారం మొదలైంది. అయితే ఈ నెగిటివిటి ట్రోల్స్ పై కృతి శెట్టి స్పందించింది. తనేం చెయ్యకపోయినా తనని ఎందుకు తిడుతున్నారో అర్ధం కావడం లేదు అంటూ ఆమె వాపోయింది.
ఆన్ లైన్ లో నాపై నెగిటివిటీ ఎందుకు చూపిస్తున్నారో తెలియదు, నాపై అంత కోపమెందుకు. నేనేం చేశాను. వారు అంతగా కోప్పడే విధంగా నేనేమి చెయ్యలేదు. ఆ విమర్శల్లోనూ పాజిటివ్ నెస్ చూడొచ్చుగా అంటూ ఉంటారు. కానీ అన్నిసార్లు అది సాధ్యమయ్యేపని కాదు. కొంతమంది నటీనటులు ఫ్యామిలీపై కూడా విషం చిమ్ముతారు. అలా చెయ్యడం వలన ఏం వస్తుంది వాళ్ళకి. మీ ఫ్యామిలీ గురించి మీడియాలో రాస్తే మీకెలా ఉంటుంది అంటూ కృతి శెట్టి ఫైర్ అవుతుంది.
అంతేకాకుండా ఈమధ్యన నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను అంటున్నారు. ఉప్పెన సినిమాలో ఉన్నట్టుగా ఇప్పుడు లేను అంటున్నారు. హెయిర్ స్టయిల్స్, మేకప్ వలన అందంలో మార్పు కనిపిస్తుంది. వయసు పెరుగుతున్నప్పుడు కూడా మోహంలో, శరీరంలో మార్పులు వస్తాయి. అవి కొత్తగా కనిపిస్తే నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు కాదు అంటూ కృతి శెట్టి తనపై జరుగుతున్న ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ కి క్లారిటీ ఇచ్చింది.