Advertisement
Google Ads BL

జబర్దస్త్ రోహిణికి మరో సర్జరీ


జబర్దస్త్ లో ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే రోహిణి ఇప్పుడు కంటతడి పెడుతోంది. కారణం ఆమె కాలుకి జరిగిన సర్జరీ వలన. తాజాగా రోహిణి తన యూట్యూబ్ ఛానల్ లో తన కాలుకి సర్జరీ జరిగినట్టుగా వెల్లడించింది. ఎంతో బాధని అనుభవించానంటూ కంటతడి పెట్టడం అందరిని కలిచివేసింది. గతంలో ఓ యాక్సిడెంట్ లో తన కాలికి తగిలిన దెబ్బ వలన కాలు లో రాడ్ వెయ్యగా.. అది తీయించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో అది తన కాలు స్కిన్ కి అటాచ్ అవడంతో దానిని సర్జరీ చేసి తియ్యడానికి డాక్టరస్ పది గంటల పాటు శ్రమించిన విషయాన్ని ఆ వీడియోలో షేర్ చేసింది. 

Advertisement
CJ Advs

ఆరేళ్ల క్రితం రోహిణికి వైజాగ్ లో ఓ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆమెకు ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ కుడి కాలిలో రాడ్ వేశారు. మూడేళ్ళ తరవాత ఆ రాడ్ తీసేయాలి. కానీ రోహిణి కెరీర్‌లో బిజీగా ఉండటంతో కాలిలో ఉన్న రాడ్ తీయించుకోవడం కుదర్లేదు. ఇప్పుడు ఆరేళ్ళ తర్వాత అది తీయించుకోవడానికి వెళ్లగా.. సర్జరీ మొదలుపెట్టిన డాక్టర్లు కాలిలో ఉన్న రాడ్‌ను తీయలేకపోయారు. చాలా కాలం కావడంతో లోపల స్కిన్‌కు రాడ్ అతుక్కుపోయిందని.. తీయడంకుదరదని చేతులెత్తేశారు అంటూ ఓ వీడియోలో చెప్పింది.

తర్వాత తనకి రాడ్ వేసిన డాక్టర్ ని కలవగా ఆయన విజయవాడకి రమ్మని చెప్పడంతో అక్కడికి వెళ్లిన రోహిణికి కాలులో రాడ్ తీసేందుకు ఓ గంట సరిపోతుంది అని చెప్పి.. దాదాపు పడి గంటలు శ్రమించి తన కాలిలోని రాడ్ ని తొలగించినట్లుగా రోహిణి చెప్పింది. తనకి చాలా భయం వేసినా తన తల్లి ధైర్యంగా తనని చూసుకున్నట్లుగా రోహిణి ఆ వీడియోలో షేర్ చేసింది. 

తాను ఆ రాడ్ తీయించుకోవడంలో అశ్రద్ధ చేశానని.. ఎవరూ అలా అశ్రద్ధ చేయొద్దని చెప్పిన రోహిణి ఇంత బాధ ఎవరికీ రాకూడదని కంటతడి పెట్టుకుంది.

Another surgery for Jabardasth Rohini:

Jabardasth Rohini Leg Surgery
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs