పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ అప్ డేట్స్ తో పవన్ ఫాన్స్ కి నిద్ర పట్టడం లేదు. ఒక సినిమా అప్ డేట్ తో పండగ చేసుకునేలోపు మరో సినిమా అప్ డేట్ ఇచ్చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న PKSDT నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రాబోతుంది అని మేకర్స్ ప్రకటన ఇచ్చిన వెంటనే.. ఇదే రోజు గురువారం పవన్ కళ్యాణ్-సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #OG నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకి వచ్చింది.
దానయ్య ఎంటర్టైన్మెంట్ పై సుజిత్ తెరకెక్కిస్తున్న ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మొదటి షెడ్యూల్ ముంబై పరిసర ప్రాంతాల్లో జరిగింది. తర్వాత పూణేలోను కొద్దిరోజులపాటు OG షూటింగ్ ని ఫినిష్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడప్పుడే సెకండ్ షెడ్యూల్ కి వెళ్లకపోవచ్చనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. కారణం ఉస్తాద్ భగత్ సింగ్, హరి హార వీరమల్లు షూటింగ్స్ లోకి వెళతారని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు నుండి #OG సెకండ్ షెడ్యూల్ లోకి ఎంటర్ అయ్యారు.
After a blazing Mumbai schedule, #OG has begun its second schedule in Hyderabad today. ⚡️ ముంబై షెడ్యూల్ తర్వాత సెకండ్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టినట్టుగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చేసారు. పవన్ కళ్యాణ్ ఇంత స్పీడుగా ఈ మూవీని కంప్లీట్ చెయ్యడం అనేది మిగతా హీరోల ఫాన్స్ కి మింగుడు పడడం లేదు.