Advertisement
Google Ads BL

ఏంటి కీర్తి కథ..!


నటి కీర్తి సురేష్ ఇప్పుడు గ్లామర్ లుక్ లో మెస్మరైజ్ చేస్తుంది. డీ గ్లామర్ రోల్ లో దసరా చిత్రంతో కీర్తి సురేష్ నటనని అందరూ మెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ ప్రాజెక్ట్స్ తో కీర్తి సురేష్ కాస్త బిజీగానే గడుపుతుంది. ఆమెకి టాలీవుడ్ లో మాత్రం స్టార్ ఆఫర్స్ ఆశించినంతగా రావడం లేదు. అయితే గత కొద్దిరోజులుగా కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో నడుస్తుంది. కీర్తి సురేష్ ఓ వ్యాపారవేత్తని వివాహం చేసుకోబోతున్నట్లుగా టాక్ ఉంది.

Advertisement
CJ Advs

కానీ మధ్యలో ఆమె పెళ్లి వార్తలపై తల్లితండ్రులు స్పందించారు. కీర్తి సురేష్ ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు. ముందు కెరీర్ ఇంపార్టెంట్ అన్నారు. తాజాగా కీర్తి సురేష్  ఓ వ్యక్తితో కలసి క్లోజ్ గా ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఆ వ్యక్తి పేరు ఫర్హాన్ బీన్ లియాఖత్ అని, అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. లియాఖత్ కు కీర్తి సురేశ్ స్పెషల్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. హ్యాపీ బర్త్ డే ఫర్హానీ.. ఈ ఏడాది నీకు మంచి ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పింది.

ఇంకేముంది కీర్తి సురేష్ ఫర్హాన్ బీన్ లియాఖత్ నే వివాహం చేసుకోబోతుంది. అందుకే అంత క్లోజ్ గా బిహేవ్ చేస్తూ.. అతనికి సోషల్ మీడియాలో విషెస్ తెలియజేసింది. నిజానికి వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులని తెలుస్తోంది. మరి నిజంగానే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది అతన్నెనా.. ఈ ఏడాది పెళ్ళైపై కీర్తి ఏమైనా గుడ్ న్యూస్ చెబుతుందా అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

Keerthi Suresh Likely Marriage With A Business Man?:

Keerthi Suresh Likely Marriage With A Business Man!, Pic Goes Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs