Advertisement
Google Ads BL

ఆదిపురుష్ ప్రీమియర్ షో క్యాన్సిల్


ప్రభాస్ ఆదిపురుష్ విడుదలకు జస్ట్ ఓ నెల రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ఆదిపురుష్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో మొదలైపోయాయి. అటు ప్రమోషన్స్ ఇటు కాంట్రవర్సీలు అంటూ ఆదిపురుష్ హడావిడి సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. దర్శకుడు ఓం రౌత్ అలాగే నిర్మాతలు కలిసి ఆదిపురుష్ రిలీజ్ విషయంలో అందరిలో అంచనాలు పెంచడానికి ట్రై చేస్తున్నారు. గుడులు గోపురాలు తిరుగుతూ ఆదిపురుష్ హిట్ అవ్వాలని స్పెషల్ ప్రార్ధనలు చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ప్రభాస్ భద్రాద్రి రాముడికి భారీ విరాళమిచ్చాడు. అయితే ఆదిపురుష్ టీజర్ చూసాక సినిమాపై ఫాన్స్ హోప్స్ వదులుకున్నారు. కానీ ట్రైలర్ తో మళ్ళీ సినిమాపై క్రేజ్ పెంచేసాడు దర్శకుడు. ఆదిపురుష్ ట్రైలర్ 3D లో మెస్మరైజ్ చేసింది. ఆ ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో ఆదిపురుష్ పై హైప్ క్రియేట్ చేసారు. సాంగ్స్, ఇంకా ప్రమోషనల్ ఈవెంట్స్ తో సినిమా విడుదల సమయానికి మరింతగా అంచనాలు పెంచబోతున్నారు.

ఇక జూన్ 13 నుండే ఆదిపురుష్ స్పెషల్ ప్రీమియర్స్ అంటూ సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నారు. జూన్ 7 నుంచి జూన్ 18 వరకు జరగనున్న ట్రిబెకా ఫెస్టివల్‌లో ఆదిపురుష్ ప్రీమియర్‌గా ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అందులో ఒక షో క్యాన్సిల్ అయినట్లు సమచాారం. జూన్ 13న ప్లాన్ చేసిన ఆదిపురుష్ ప్రీమియర్ షో క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. జూన్ 15, జూన్ 17న ప్లాన్ చేసిన మిగిలిన రెండు షోలు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి.

న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫెస్టివల్‌‌లో వరల్డ్ ప్రీమియర్ కోసం జ్యూరీ కేటగిరిలో ఆదిపురుష్ చిత్రాన్ని ఎంపిక చేసారు. క్రియేటివిటీ, ఎంటర్‌టైన్మెంట్‌కు కేరాఫ్ అడ్రెస్ గా జరిగే ఈ ఫెస్టివల్‌లో ఆదిపురుష్ చిత్రం 3D విభాగంలో మిడ్‌నైట్ ఆఫరింగ్ గా ప్రదర్శితం కానుంది. ఈ ప్రీమియర్ షోలలో ఒక దాన్నే తాజాగా క్యాన్సిల్ చేశారు.

Adipurush international premieres canceled:

Disappointing news from Adipurush makers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs