Advertisement
Google Ads BL

మహేష్ ఫాన్స్ లో అసంతృప్తి?


మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న హ్యాట్రిక్ మూవీ #SSMB28 షూటింగ్ కి గ్యాప్ ఇచ్చేసి అప్పుడే నెలన్నర దాటిపోయింది. మహేష్ బాబు ఫ్యామిలీ వెకేషన్స్ అంటూ విదేశాలకు వెళ్లడంతో త్రివిక్రమ్ కూడా మహేష్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే మహేష్ బాబు ఈ వారంలోనే హైదరాబాద్ కి తిరిగొస్తున్నారట. మే 31 న #SSMB28 నుండి టైటిల్ అండ్ లుక్ తో కలిపి స్పెషల్ గ్లిమ్ప్స్ వదలబోతున్నారు. ఇదంతా మహేష్ ఫాన్స్ ని ఎగ్జైట్ చేసే వార్తలే. 

Advertisement
CJ Advs

కానీ ఇప్పడు మహేష్ ఫాన్స్ లో అసంతృప్తి కనిపిస్తుంది. కారణం #SSMB28 కి పెట్టబోయే టైటిల్ విషయంలో వాళ్ళు డిస్పాయింట్ అవుతున్నారని తెలుస్తుంది. అమరావతికి అటు ఇటు, గుంటూరు కారం అంటూ ఏవేవో టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇవేమి మహేష్ ఫాన్స్ ని ఇంప్రెస్స్ చెయ్యడం లేదు. ఖచ్చితంగా గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు టైటిల్స్ లో ఒకటి మహేష్-త్రివిక్రమ్ #SSMB28 కి పెట్టె ఛాన్స్ ఉంది అంటున్నారు.

ఈ విషయంలోనే మహేష్ ఫాన్స్ టెన్షన్ పడుతున్నారట. ఈ టైటిల్స్ రెండూ అంత ఇంట్రెస్టింగ్ గా లేవు.. ఈ టైటిల్స్ ప్రేక్షకుల్లోకి ఏపాటి వెళతాయి. త్రివిక్రమ్ అంటే కొత్తదనం. ఆయన టైటిల్స్ తోనే సినిమాపై అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తారు. కానీ ఇప్పుడు ఈ టైటిల్స్ విషయంలో ఇలాంటి సింపుల్ టైటిల్స్ ఎందుకు ఎంచుకున్నారని వారు తెగ మధనపడిపోతున్నారు.

Dissatisfaction in Mahesh fans?:

Fans highly disappointed with Mahesh Babu SSMB28 title?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs