ప్రభాస్ బాహుబలి తో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాక ఆ క్రేజ్ నిలబెట్టుకోవడానికి ఎక్కువగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ నే చేస్తున్నారు. సలార్, ఆదిపురుష్, స్పిరిట్, ప్రాజెక్ట్ K ఇలా అన్నీ వరసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ప్రతీది క్రేజీ ప్రాజెక్ట్స్ కావడంతో ప్రభాస్ పై వందల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు నిర్మాతలు. అయితే ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ 28 న రిలీజ్ కాబోతున్న సలార్ టీజర్ కోసం ప్రభాస్ ఫాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు.
రీసెంట్‌గా 35 కోట్ల ఖర్చుతో ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్‌ని భారీగా చిత్రీకరించారట. ఇది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో భాగమైన ప్రతి ఒక్కరూ ఈ సన్నివేశం చాలా బాగా వచ్చిందని హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇది సలార్ ప్రీ ఇంటర్వెల్ లో వస్తుంది అని.. ఈ సీక్వెన్స్ ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలవబోతుంది అంటున్నారు. ప్రశాంత్ నీల్ ట్రాక్ రికార్డ్ మరియు ప్రభాస్ యొక్క భారీ ఇమేజ్ సలార్ మేకర్స్ కి బాగా కలిసొస్తాయని.. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయమంటున్నారు.
రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ మెయిన్ విలన్ గా భయంకరంగా కనిపిస్తుండగా, జగపతి బాబు.. ఇంకా కొంతమంది విలన్స్ కీలకంగా కనిపిస్తారట. శృతి హాసన్ హీరోయిన్ గా ప్రభాస్ తో మొదటిసారి రొమాన్స్ చేయబోతుంది.