Advertisement
Google Ads BL

PKSDT టైటిల్ అండ్ లుక్ వచ్చేస్తున్నాయ్


సముద్ర ఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చేస్తున్న #PKSDT(వర్కింగ్ టైటిల్) పూజా కార్యక్రమాలతో మొదలవడమే రెగ్యులర్ షూట్ కి వెళ్ళిపోయింది. 22 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఏకధాటిగా ఆ సినిమా షూటింగ్ చేసి తన పార్ట్ ముగించేశారు. తరవాత సముద్రఖని సాయి ధరమ్ తేజ్ సీన్స్, అలాగే కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తూ చకచకా షూటింగ్ కంప్లీట్ స్టేజ్ కి తీసుకొచ్చేసారు. జులై 28 న #PKSDT రిలీజ్ అంటూ పవన్ ఫాన్స్ ని థ్రిల్ చేసారు. ఈ చిత్రం తమిళ హిట్ మూవీ వినోదియం సిత్తం చిత్రానికి రీమేక్.

Advertisement
CJ Advs

#PKSDT విడుదలకు సమయం దగ్గరపడుతోంది.. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. అలాగే ఫస్ట్ లుక్ ఇవ్వలేదు అంటూ పవన్ ఫాన్స్ కంగారు పడుతున్నారు. తాజాగా #PKSDT ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ వచ్చేస్తున్నాయ్ అంటూ టైము, డేటు ఫిక్స్ చేసి ప్రకటించారు. మే 18 అంటే రేపు సాయంత్రం 4:14 #PKSDT టైటిల్ రాబోతుంది. #PKSDT Title & First Look Tomorrow at 4:14PM ⚡ Stay tuned ⏳ అంటూ అంకెర్స్ ఇంతకుముందే ప్రకటించారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రానికి రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. దేవుడే దిగి వచ్చినా, బ్రో టైటిల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఫైనల్ గా #PKSDT కి బ్రో టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. రేపు ఈవెనింగ్ ఇదే టైటిల్ ని ఫస్ట్ లుక్ తో రివీల్ చేస్తారని సమాచారం.

PKSDT Title & First Look Tomorrow :

PKSDT Title & First Look Tomorrow at 4:14PM
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs