మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడా.. అది కూడా అతను ప్రేమించిన అమ్మాయితో అంటూ ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. మిస్టర్ మూవీలో తనతో కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో ఫ్రెండ్ షిప్ చేసిన వరుణ్ తేజ్ తర్వాత ఆమెతో ప్రేమలో పడ్డాడు.. ఇద్దరూ సీక్రెట్ డేటింగ్ లో ఉన్నారు.. నిహారిక పెళ్లి సమయంలో లావణ్య త్రిపాఠిని ప్రత్యేకంగా వరుణ్ ఆహ్వానించాడు, నాగబాబు కూడా వీళ్ళపెళ్ళికి ఒప్పుకున్నారంటూ ఏవేవో ప్రచారాలు జరిగాయి.
అంతేకాకుండా వరుణ్ బర్త్ డే సమయంలో లావణ్యతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు, లావణ్య బర్త్ డే కి ఓ కాస్ట్లీ ఉంగరం వరుణ్ ఆమెకి ప్రెజెంట్ చేసాడని కూడా అన్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు.. జూన్ లో వీరి ఎంగేజ్మెంట్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల పెళ్లి పెద్దల అంగీకారంతో జరగబోతుంది అంటున్నారు.
అయితే మెగా ఫ్యామిలీ నుండి ఈ న్యూస్ పై ఎవరూ స్పందించడం లేదు. మరోవైపు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ పనులు కూడా మొదలైపోయినట్లుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్.