Advertisement
Google Ads BL

శ్రీలీల క్రేజ్ ని భలే వాడేస్తున్నారు


శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజీగా మారింది. టాలీవుడ్ హీరోలే కాదు.. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆ హీరోయిన్ జపమే చేస్తున్నారు. శ్రీలీల వచ్చే రెండేళ్లలో ఆమె నటించిన సినిమాల్లో చాలా సినిమాలు విడుదలవుతాయి. అన్ని సినిమాలతో ఆమె బిజీ హీరోయిన్ గా కాదు లక్కీ హీరోయిన్ గా మారింది. శ్రీలీల డాన్స్, ఎనర్జీ లుక్స్, అందం అన్ని ప్రేక్షకులని కట్టి పడేస్తున్నాయి. ధమాకా హిట్ కి కేవలం శ్రీలీలే కారణమని ఆడియన్స్ తో పాటుగా ట్రేడ్ వర్గాలు కూడా ఫిక్స్ అయ్యారు.

Advertisement
CJ Advs

అందుకే శ్రీలీల క్రేజ్ ని ఆమె డాన్స్ స్టెప్స్ ని ఇప్పుడో కుర్ర హీరో తన సినిమా కోసం వాడేస్తున్నాడు. అన్ని మంచి శకునములే అంటూ ఏప్రిల్ 18 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంతోష్ శోభన్ తన సినిమా ప్రమోషన్ కోసం శ్రీలీల క్రేజ్ ని వాడేసాడు. శ్రీలీలతో కలిసి డాన్స్ చేస్తూ వీడియో చేసి వదిలాడు. సంతోష్ శోభన్ తో శ్రీలీల మోడరన్ డ్రెస్ లో వేసిన స్టెప్స్ వైరల్ గా మారాయి.

అన్ని మంచి శకునములే మూవీలో సాంగ్ కి సంతోష్ తో శ్రీలీల వేసిన స్టెప్స్ కి ఆమె అభిమానులే కాదు.. ఆడియన్స్ కూడా ముగ్దులవుతున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో స్టార్ అండ్ యంగ్ హీరోలతో కలిసి తొమ్మిది ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Sreeleela Cute Dance with Santosh Sobhan:

Sreeleela and Santosh Shoban tripping to AMS songs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs