ప్రస్తుతం పూరి జగన్నాథ్ లైగర్ డిసాస్టర్ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ నానా గొడవ చేస్తున్నారు. ఆరు నెలల క్రితం బయ్యర్ల నష్టాలను పూడుస్తామని ఛార్మి, పూరి జగన్నాథ్ మాటిచ్చారు. ఆరు నెలలు గడిచిపోయినా వాళ్ళకి ఇంకా సెటిల్ చెయ్యకపోవడంతో బయ్యర్లు ప్రస్తుతం ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. లైగర్ డిసాస్టర్ మొత్తం వ్యవహారంలో విజయ్ దేవరకొండ త్వరగా కోలుకుని... ఆ మూడ్ నుండి బయటికి వచ్చేసి ఇతర ప్రాజెక్ట్స్ షూటింగ్స్, ఫాన్స్ మీటింగ్స్, యాడ్ షూట్స్ అంటూ హడావిడిపడుతున్నాడు. పూరి, ఛార్మి నిన్నమొన్నటివరకు ఏమిటి ఇప్పటికీ లైగర్ ప్రోబ్లెంస్ తోనే సతమవుతున్నారు.
అయితే తాజాగా కొంతమంది విజయ్ దేవరకొండ తాను తీసుకున్న పారితోషకాన్ని వెనక్కి ఇచ్చేసి లైగర్ డిస్ట్రిబ్యూట్ర్స్ కి వచ్చిన నష్టాలను ఎంతో కొంత కవర్ చెయ్యొచ్చు కదా.. ఆచార్య డిసాస్టర్ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన పారితోషకంలో కొంత ఆచార్య బయ్యర్లకి సెటిల్ చేసారు. అలానే విజయ్ దేవరకొండ కూడా తన పారితోషకంలో ఎంతోకొంత నష్టపోయిన వారికి సెటిల్ చెయ్యాలంటూ విజయ్ దేవరకొండ యాంటీ ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండపై కావాలని బురద జల్లడం సరికాదని, అతన్ని టార్గెట్ చెయ్యడం కరెక్ట్ కాదు, అతని పారితోషకంలో కేవలం 25 పర్సెంట్ మాత్రమే అతనికి రెమ్యునరేషన్ కింద చెల్లించారు... ఈ లైగర్ నష్టాలకి, విజయ్ కి ఎలాంటి సంబంధం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి లైగర్ ప్లాప్ విషయంలో విజయ్ దేవరకొండ కూడా ఎవ్వరిని బ్లేమ్ చెయ్యకుండా తన పని తాను చూసుకుంటూ తదుపరి ప్రాజెక్ట్స్ లో బిజీగా మారాడు.