Advertisement
Google Ads BL

ఆ హీరోయిన్ అదృష్టానికి కుళ్ళుకుంటున్నారు


ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల హవా కొనసాగుతుంది. కుర్ర హీరోలంతా శ్రీలీల జపం చేస్తున్నారు. టాలీవుడ్ లోకి యంగ్ హీరోలంతా శ్రీలీల డేట్స్ కోసం కోసం వెయిట్ చేసేలా కనిపిస్తుంది ఆమె యవ్వారం. లుక్స్ విషయంలోనూ, ఎనేర్జి విషయంలోనూ, డాన్స్ ఇలా ప్రతి విషయంలో శ్రీలీల కి ఫుల్ మార్కులు పడిపోతున్నాయి. అందుకే ఆమె డేట్స్ కోసం అంతలా ఎగబడుతున్నారు. కానీ శ్రీలీల అదృష్టానికి చాలామంది హీరోయిన్స్ రగిలిపోతున్నారు. ముఖ్యంగా నిన్నమొన్నటివరకి టాప్ పొజిషన్ ని ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే, రశ్మికలైతే మరింత ఎక్కువగా ఫీలవుతున్నారట.

Advertisement
CJ Advs

పది ప్రాజెక్టులతో శ్రీలీల డైరీ ఫుల్ అయ్యింది. ఇంతమంది అవకాశాలు ఇచ్చారు.. ఇన్ని సినిమాల షూటింగ్స్ ని ఎలా చేస్తుందో అనుకుంటే.. శ్రీలీల ప్రతి సినిమా షూటింగ్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఎక్కడా తన వల్ల దర్శకులు, నిర్మాతలు ఇబ్బంది పడకుండా డేట్స్ ని మ్యానేజ్ చేస్తుందట. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య, రామ్, నితిన్, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ శ్రీలీలకి పిలిచి అవకాశాలు ఇచ్చారు. ప్లాప్ సినిమాలకే ఆమెకి ఇంత డిమాండ్ ఉంటే ఒక్క సినిమా హిట్ అయినా శ్రీలీలని ఆపాతరమా అన్నట్టుగా ఉంది.

అందుకే ఆమె అదృష్టానికి ఆ హీరోయిన్స్ తెగ ఫీలైపోతున్నారు. 

పెద్ద హీరోలు, యంగ్ హీరోలతో శ్రీలీల్ కెరీర్ మూడు పూలు ఆరు కాయాలంటూ వెలిగిపోతుంది. ప్రస్తతం ఏ హీరోయిన్ కి లేని డిమాండ్ శ్రీలీల కి ఉంది. ఈరోజు రామ్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ అయిన BoyapatiRapo టీజర్ లో శ్రీలీల మోడ్రెన్ లుక్ లో క్రేజీగా కనిపించింది.

Heroines Unhappy with Sreeleela Luck:

Superb response to Sreeleela look in BoyapatiRapo Thunder
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs