Advertisement
Google Ads BL

NBK108 పై ఇంట్రెస్టింగ్ న్యూస్


నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK108 చిత్రంపై క్రేజీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బాలయ్యకి అపోజిట్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ కనిపిస్తున్నారు. రీసెంట్ గానే ఆయన NBK108 సెట్ లోకి ఎంటర్ అయ్యారు. దసరా టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ అండ్ టీజర్ జూన్ 10 న బాలయ్య బాబు బర్త్ డే స్పెషల్ గా రాబోతుంది. బాలయ్య పవర్ ఫుల్ గా మూడు వేరియేషన్స్ ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నారు.

Advertisement
CJ Advs

ఇప్పటికే బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పెర్ లుక్ ఫాన్స్ ని విపరీతంగా ఇంప్రెస్స్ చేసింది. అయితే ఈ చిత్రంలో బాలయ్య ఫస్ట్ హాఫ్ లో ఎక్కువశాతం జైలు లోనే  ఖైదీగా కనిపించబోతున్నారట. ఇంటర్వెల్ సీన్ లోనే బాలయ్య అసలు ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది అనేది పవర్ ఫుల్ ట్విస్ట్ తో అనిల్ రావిపూడి రివీల్ చేసే సన్నివేశాలు కేకపుట్టిస్తాయని.. ఈ సీన్ లో శ్రీలీల కూడా కనిపించబోతుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న NBK108  లో బాలయ్య తెలంగాణ యాసలో ఇరగదియ్యబోతున్నారట.

ఈ చిత్రం కథపై సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ముప్పై ఏళ్ల వయసులో ఆవేశంలో చేసిన గొడవల కారణంగా హీరోకి 14 ఏళ్లు శిక్ష పడుతుందట. అలా జైలు నుంచి విడుదలైన హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుందట. బాలయ్య క్యారెక్టర్ ప్రతి వేరియేషన్ లోను వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని, ముఖ్యంగా 60 ఏళ్ల వ్యక్తిగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ అదిరిపోతోందని టాక్ నడుస్తోంది. 

ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ ఆగర్వాల్ నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే కాజల్, శ్రీలీల ఇద్దరూ NBK108 షూటింగ్ లో పాల్గొంటున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమా చిత్రీకరణని ఫుల్ స్వింగ్ లో నడిపిస్తున్నాడు.

Interesting news on NBK108:

Balakrishna-Anil Ravipudi Movie Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs