Advertisement
Google Ads BL

ఆసుపత్రిలో జబర్దస్త్ లేడి కమెడియన్


జబర్దస్త్ కమెడియన్స్ లో పంచ్ ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్ కోసం ఎక్కువగా హాస్పిటల్ లోనే ఉంటున్నాడు. మధ్యలో జబర్దస్త్ ప్రోగ్రాం, శ్రీదేవి డ్రామా కంపెనీలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ ఆసుపత్రి పాలైంది. సీరియల్ ఆర్టిస్ట్ గా ఫెమస్ అయ్యి బిగ్ బాస్ లో పేరు తెచ్చుకుని ప్రస్తుతం పలు షోస్ లో కనిపిస్తూనే జబర్దస్త్ లో రౌడీ రోహిణిగా టీం లీడర్ అవతారమెత్తిన రోహిణి తాజాగా ఆసుపత్రి పాలైనట్లుగా తన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.

Advertisement
CJ Advs

తనకి ఐదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో కాలుకి ప్రాక్చర్ అవ్వగా వైద్యులు కాలులో రాడ్ వేశారని.. అది తర్వాత తీసివేయాలని చెప్పినప్పటికీ.. ఆ రాడ్ తీయించుకోవడానికి తనకి సమయం దొరకలేదని, ఇప్పుడు ఆ రాడ్ తియ్యడానికి లేకుండా లోపల స్కిన్ కి ఎటాచ్ అయ్యింది.. ఒకవేళ ఫోర్స్ గా తీసినప్పటికి అక్కడ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం ఉంది అని డాక్టర్స్ చెప్పడంతో ఆగిపోయినట్లుగా, అది తన దురదృష్టమంటూ ఆ వీడియోలో చెప్పింది.

అయితే ఆ రాడ్ తియ్యనప్పటికీ.. కాలుకి మైనర్ సర్జరీ జరిగింది అని, అందుకే ఆసుపత్రిలో ఉన్నట్లుగా రౌడీ రోహిణి ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ఈ మధ్యన రోహిణి బలగం మూవీలోను, సేవ్ ద టైగెర్స్ సీరీస్ లో పనమ్మాయిగా ప్రేక్షకులని నవ్వించింది.

Jabardasth Rohini Joined in Hospital:

Jabardasth Rohini Joined in Hospital and emotional video goes viral.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs