Advertisement
Google Ads BL

పక్కా అని చెబుతున్నా అందరికి అనుమానాలే


ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్యాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సలార్ మూవీ సెప్టెంబర్ 28 న రిలీజ్ అంటూ పదే పదే తేదీపై క్లారిటీ ఇస్తూ వస్తున్నా ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ పై అందరిలో అనుమానాలు రేజ్ అవుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ లేదు. 2024 సమ్మర్ మార్చ్ కి షిఫ్ట్ అవ్వొచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
CJ Advs

అసలు సెప్టెంబర్ లో రిలీజ్ కాబోయే సినిమాకి ఇప్పటివరకు టీజర్ ఇవ్వకపోవడమేమిటో ప్రభాస్ ఫాన్స్ కి అంతుబట్టడం లేదు. సోషల్ మీడియాలో సలార్ డేట్ పై ఎప్పటికప్పుడు ఎంతగా క్లారిటీ ఇచ్చినా ఈ రకమైన రూమర్స్ తో ఫాన్స్ ఫీలైపోతున్నారు. ఆదిపురుష్ జూన్ 16 న వస్తుంది. ఆరు నెలల గ్యాప్ తో సలార్ వస్తే బావుంటుంది అని కొంతమంది అంటున్నారు. అయితే గత రెండు రోజులుగా సలార్ రిలీజ్ డేట్ పై అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది అంటూ హడావిడి మొదలైంది.

దానితో హోంబులే ఫిలిమ్స్ వారు రంగంలోకి దిగి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ విషయంలో మార్పులు ఉండవు..  అనుకున్న సమయానికి సెప్టెంబర్ 28 నే సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా చెప్పారు. ప్రెజెంట్ సలార్ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ప్రశాంత్ నీల్ పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టెయ్యాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే జూన్ లో ఆదిపురుష్ హడావిడి ముగియగానే సలార్ హడావిడి మొదలవ్వుద్ది అంటున్నారు.

Team Salaar condemns the postponement rumors:

Salaar update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs