అల్లరి నరేష్ నాంది మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ అయ్యాడు. ఆ చిత్రం అల్లరి నరేష్ లోని సీరియస్ కోణాన్ని పరిచయం చేసింది. కామెడీ హీరో సీరియస్ పాత్రలో అద్భుతః అనిపించాడు. ఇక మధ్యలో మారేడుమిల్లు ప్రజానీకంగా అంటూ డిసాస్టర్ మూవీ చేసినా ఆ తర్వాత ఉగ్రంతో మల్లీ హిట్ అందుకున్నాడు ఉగ్ర హిట్ తర్వాత అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ తాను ఈమధ్యన పాములంటే భయపడి ఓ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నట్లుగా చెప్పి షాకిచ్చాడు.
తనకు కథ నచ్చినప్పటికీ అందులో పాములు ఉండటంతో.. అవంటే భయపడి ఆ సినిమా చెయ్యడం నా వల్ల కాదు అని నో చెప్పాడట. అల్లరి నరేష్ కి పాములు అంటే చాలా భయమట. అందుకే ఆ కథని రిజెక్ట్ చెయ్యగా... ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కూర్చుందట. ఆ కథ చెప్పి డైరెక్టర్ ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా నరేష్ మాత్రం ఆ పాముల భయానికి నో చేప్పేసాడట.
మరి ఆ కథ నిఖిల్ నటించిన కార్తికేయ అంటున్నారు. చందు మొండేటి అల్లరి నరేష్ కి కార్తికేయ కథ చెప్పగా.. ఆయన రిజెక్ట్ చేయడంతోనే ఆ సినిమా నిఖిల్ దగ్గరకి వెళ్లడం.. ఆ కథతో కార్తికేయ చేసి దానికి సీక్వెల్ చేసి చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పాపం అలా అల్లరి ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ మిస్ అయ్యిందన్నమాట.