మెగాస్టార్ కోడలు, స్టార్ హీరో రామ్ చరణ్ వైఫ్, కామినేని ఆడపడుచు ఉపాసన కొణిదెల పదేళ్ల తర్వాత తల్లికాబోతున్న మధుర క్షణాలను మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంతో ఆస్వాదిస్తోంది. మెగా వారసుడిని ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా అనే ఆత్రంతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఉపాసన కూడా నిన్నమొన్నటివరకు యాక్టీవ్ గా దేశ విదేశాలు తిరుగుతూ భర్తతో కలిసి గడుపుతుంది. అయితే ఇప్పటివరకు ఉపాసన బేబీ బంప్ పెద్దగా కనిపించలేదు, అలాంటి లూజ్ అవుట్ ఫిట్స్ తో ఉపాసన కనిపించింది.
ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఉపాసన బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. అంతేకాకుండా వారసత్వంపై ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తల్లికాబోతున్న నా ఈ నిర్ణయం వారసత్వాన్ని కొనసాగించాలని కానీ, లేదంటే వివాహ బంధాన్ని బలోపేతం చేసుకునే కోరికతో తీసుకున్నది కాదు. నా బిడ్డకి అంతులేని ప్రేమని అందించాలనే తపనతోనే నేను తల్లికాబోతున్నాను.
బిడ్డని బాధ్యతగా పెంచి జాగ్రత్తగా చూసుకుంటానని మెంటల్ గా ప్రిపేర్ అయ్యాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.. అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.