సీరియల్ హీరోగా స్టార్ మా బిగ్ బాస్ లో అడుగుపెట్టిన విజె సన్నీ బిగ్ బాస్ లో అనుకోకుండా హైలెట్ అయ్యి విన్నర్ గా నిలిచాడు. టైటిల్ ఫెవరెట్ గా బరిలోకి దిగిన షణ్ముఖ్ సిరితో చేసిన ఫ్రెండ్ షిప్ వలన అతన్ని ప్రేక్షకులు లైట్ తీసుకొగా.. తనకున్న క్రేజ్ తో రన్నర్ గా నిలవగా లక్కీగా సన్నీ విన్నర్ గా నిలిచాడు బిగ్ బాస్ టైటిల్ కొట్టాక సన్నీ హీరోగా సినిమాలు మొదలు పెట్టాడు. వరసగా హీరో అవకాశాలు రావడంతో సీరియల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి హీరోగా మారాడు.
ప్రస్తుతం పలు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న సన్నీ సప్తగిరితో కలిసి చేస్తున్న అన్ స్టాపబుల్ నుండి ప్రోమో కోసం చేస్తున్న షూటింగ్ లో సన్నీకి గాయాలయ్యాయి. ఆ ప్రోమో కోసం సప్తగిరి అన్ స్టాపబుల్ ప్రోమో ఎప్పుడు అని అడుగుతూ నటుడు పృథ్వికి గన్ పెట్టగా అటుగా వచ్చిన సన్నీకి బుల్లెట్ తగలడంతో సన్నీ గాయపడ్డాడు. డమ్మీ బుల్లెట్ అయినప్పటికీ ఫోర్స్ గా రావడంతో సన్నీకి గాయాలైనట్లుగా తెలుస్తుంది.
అయితే సన్నీ కి ప్రమాదం జరగ్గానే అతన్ని దగ్గరలోనే ఉన్న ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది. సన్నీకి పెద్దగా గాయాలవలేదని సమాచారం.