Advertisement
Google Ads BL

ఉపాసనపై కామెంట్స్: చితకబాదిన మెగా ఫాన్స్


రామ్ చరణ్ భార్య ఉపాసన అంటే మెగా ఫాన్స్ కి ఎక్కడలేని గౌరవం. రామ్ చరణ్-ఉపాసన ఇద్దరూ తల్లితండ్రులు కాబోతున్న క్షణాలని ఎంజాయ్ చేస్తున్నారు. ఈమధ్యనే ఉపాసన హైదరాబాద్ లోని అత్తవారింట్లో ఓ శ్రీమంతం, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓసారి శ్రీమంతం నిర్వహించారు. ఉపాసన ఎప్పుడెప్పుడు మెగా వారసుడిని అందిస్తుందా అని మెగా ఫ్యామిలీ కన్నా ఎక్కువగా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఉపాసనని చెడుగా కామెంట్స్ చేసిన వ్యక్తిని మెగా ఫాన్స్ చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
CJ Advs

సెలబ్రిటీస్ ని కించపరుస్తూ రెచ్చగట్టే విధంగా మాట్లాడుతున్న సునిశిత్ అనే వ్యక్తి ఉపాసనని చెడుగా కామెంట్స్ చేస్తూ, తిడుతూ మాట్లాడ్డం మెగా ఫాన్స్ కి నచ్ఛలేదు. తానొక సెలెబ్రిటీని తనని సుకుమార్ నాన్నకు ప్రేమతో హీరోగా అడిగారు అంటూ.. రకరకాలుగా పిచ్చి కూతలు కూసే సునిశిత్ పై చాలామంది హీరోలు ఆగ్రహంగానే ఉన్నారు. తాజాగా అతను ఉపాసనపై చెడుగా మాట్లాడం విన్న మెగా ఫాన్స్ సునిశిత్ కి గట్టిగా బుద్ది చెప్పడం కాదు అతన్ని పట్టుకుని చితక్కొట్టారు.

ఇప్పటివరకు ఏ హీరో ఫాన్స్ కూడా చెయ్యని పనిని మెగా ఫాన్స్ చేసి చూపెట్టారు. ఉపాసన గురించి తప్పుగా మాట్లాడతావా అంటూ అతన్ని పట్టుకుని చితక్కొట్టిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Charan Fans attack person:

Ram Charan person who abusive talk about upasana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs