Advertisement
Google Ads BL

ఆ కాంపౌండ్ ఖాతాలో మరో డిజాస్టర్


అక్కినేని హీరోలు వరస డిజాస్టర్స్‌తో కొట్టుమిట్టాడుతున్నారు. నాగ చైతన్య థాంక్యూ ప్లాప్ తర్వాత నాగార్జున ప్రవీణ్ సత్తారుతో చేసిన ది ఘోస్ట్ బాగా నిరాశపరిచింది. అంతకుముందు చైతు నాగ్ లిద్దరూ బంగార్రాజు తో హిట్ కొట్టారు. తర్వాత నాగార్జునకి ది ఘోస్ట్, చైతూకి థాంక్యూ డిజాస్టర్స్. ఇక రీసెంట్‌గా ఏప్రిల్ 28న అఖిల్ అక్కినేని ఏజెంట్ ఘోరమైన డిజాస్టర్ అవడంతో అక్కినేని అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. చైతు అయినా ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి హిట్ కొడతాడనుకున్నారు.

Advertisement
CJ Advs

ఏజెంట్ ప్లాప్‌తో కామ్ అయిన అక్కినేని కాంపౌండ్ మళ్ళీ చైతు కస్టడీ అప్పుడు కొద్దిగా యాక్టీవ్‌గా కనిపించినా.. నాగార్జున, అఖిల్ మిగతా అక్కినేని హీరోలెవరూ చైతు కస్టడీ ప్రమోషన్స్‌లో కనిపించలేదు. చైతు కస్టడీ ప్రమోషన్స్‌కు సింగిల్‌గానే కష్టపడ్డాడు. సినిమా హిట్ అవుతుంది అంటూ నమ్మకంతో ఉన్నాడు. సినిమా రిపోర్ట్స్ చూస్తే హిట్ కొట్టడం ఖాయమనిపించింది. కానీ నాగ చైతన్య డిజాస్టర్ కూడా అక్కినేని అభిమానులని నిరాశ పరిచింది.

నిన్న శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి పూర్ ఓపెనింగ్స్, నెగెటివ్ రివ్యూస్, పబ్లిక్ నుండి సో సో టాక్ స్ప్రెడ్ అవడంతో కస్టడీ ప్లాప్ లిస్ట్‌లోకి వెళ్ళిపోయింది. అక్కినేని హీరోలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ అందుకుంటున్నారు. తండ్రి, కొడుకులిద్దరూ వరస వైఫల్యాలతో డిజప్పాయింట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. కస్టడీ మూవీ తెలుగు, తమిళంలో రెండు చోట్లా నిరాశ పరచడం మరింత బాధాకర విషయం. ఇకపై అక్కినేని హీరోలు కాస్త ఆలోచించి అడుగువేస్తే బావుంటుంది. లేదంటే అభిమానులు ఫీలవడమటుంచి వారిని చూసి వారే ఫీలవ్వాల్సి ఉంటుంది.

One More Flop Added to Akkineni Family :

Poor Reports and Reviews to Chaitu Custody
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs