Advertisement
Google Ads BL

చక్కని చుక్కకు మళ్ళీ చుక్కెదురే.!


లక్కీ హీరోయిన్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి వరసగా మూడు సినిమాలతో హిట్ కొట్టి లక్కీ గర్ల్‌గా మారిపోయింది. వరస సినిమా అవకాశాలతో కళకళలాడింది. యంగ్ హీరోలంతా కృతి శెట్టి వెంట పడ్డారు. కానీ తర్వాత కృతి శెట్టి లక్ తిరగబడింది. హ్యాట్రిక్ ప్లాప్స్ చవి చూసింది. రామ్, సుధీర్ బాబు, నితిన్ ఇలా యంగ్ హీరోలంతా నెలల గ్యాప్‌లో డిజాస్టర్స్ ఇవ్వడంతో కృతి శెట్టి బాగా ఢీలా పడిపోయింది.

Advertisement
CJ Advs

తర్వాత నెమ్మదిగా సినిమాలు చేస్తుంది. ఆఫర్స్ జోరు తగ్గింది. బంగార్రాజు హిట్ తర్వాత నాగ చైతన్య కస్టడీలో మరో ఛాన్స్ ఇచ్చాడు. కస్టడీ నిన్న శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో కృతి శెట్టి చాలా సాదాసీదాగా నార్మల్ లుక్‌లో కనిపించింది. ఏదో లవ్ ట్రాక్ ఉండాలి అన్నట్టుగా నాగ చైతన్య‌తో ట్రాక్ పెట్టారు. పక్కింటమ్మాయి టైపులో చాలా సింపుల్‌గా ఆ కేరెక్టర్‌లో కనిపించింది కృతి శెట్టి. 

ఇక కస్టడీ చిత్రానికి పబ్లిక్ నుండి నెగెటివ్ టాక్ రావడం, క్రిటిక్స్ నుండి వీక్ రివ్యూస్ రావడంతో చక్కని చుక్కకు మళ్ళీ  చుక్కెదురైంది.. ఈ చిత్రమూ ప్లాప్ లిస్ట్‌లోకి చేరిపోయింది. కస్టడీ చిత్రం వలన నాగ చైతన్య కన్నా ఎక్కువగా కృతి శెట్టి నష్టపోయేలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు హీరోలెవరూ కృతి శెట్టిని పట్టించుకోవడం లేదు. మరి తమిళమైనా కృతికి హెల్ప్ చేస్తుందేమో చూడాలి.

One More Flop in Krithi Shetty Account:

Krithi Shetty Disappointed with Custody Result
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs