Advertisement
Google Ads BL

మరోసారి బండ్ల రాజకీయాలు


కమెడియన్ కమ్ నిర్మాతగా గతంలో రాజకీయ అరంగేట్రం చేసిన బండ్ల గణేష్ ఆ తర్వాత రాజకీయాలకి రామ్ రామ్ చెప్పేసి హంగామా చేసాడు. ఇకపై రాజకీయాలకు సెలవంటూ ప్రకటించాడు. సినిమాలే ప్రపంచమన్నాడు. మహేష్ సరిలేరు నీకెవరులో నటించిన బండ్ల గణేష్ కి గతంలో వచ్చిన పవర్ ఫుల్ కామెడీ రోల్స్ ఇవ్వడం లేదు. ఇటు నిర్మాతగానూ సినిమాలు చెయ్యడం లేదు. గతంలోలా పవన్ భజన మానేసాడు. నిత్యం సోషల్ మీడియాలో ఉండే బండ్ల గణేష్ తాజాగా రాజకకీయాలపై వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Advertisement
CJ Advs

నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం 🔥🔥🔥🔥 రాజకీయాలంటే నిజాయితీ, రాజకీయాలంటే నీతి, రాజకీయాలంటే కష్టం, రాజకీయాలంటే పౌరుషం, రాజకీయాలంటే శ్రమ, రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి, రావాలి, అందుకే వస్తా🔥🔥🔥🔥🔥 బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై 🔥🔥🔥🔥🔥 నీతిగా, నిజాయితీ,గా నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తా 🔥🔥🔥🔥🔥 అంటూ వరస ట్వీట్స్ తో కాకపుట్టిస్తున్నాడు.

మరి రాజకీయాల్లోకి వస్తాను అంటూ బండ్ల ట్వీట్ చేసాడు కానీ.. ఏ పార్టీలోకి వెళుతున్నాడో అనేది క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం బండ్ల గణేష్ రాజకీయ ట్వీట్స్ దుమారాన్ని రేపుతున్నాయి.

Once again the politics of Bandla Ganesh:

Bandla Ganesh latest political tweets viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs