Advertisement
Google Ads BL

ముప్పేట దాడిపై సమంత కామెంట్స్


సమంత.. అక్కినేని నాగ చైతన్య కి విడాకులిచ్చి విడిపోయాక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఆమెపై కొంతమందికి జాలిని క్రియేట్ చెయ్యగా మరికొంతమంది సమంతని హేట్ చెయ్యడమే కాదు ఆమెపై ట్రోల్ చేసారు. దారుణాతిదారుణంగా సమంతని టార్గెట్ చేసారు. ఆమెని అనరాని మాటలు అన్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్, అక్కినేని అభిమానుల దెప్పిపొడుపులతో సమంత మానసికంగా నలిగిపోయింది. అయితే తాజాగా ఆమె విరాట్ కోహ్లీ కెరీర్ లో కొట్టిన 71 వ సెంచరీ విషయంలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ-సమంత ఖుషి సినిమా షూటింగ్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు.

Advertisement
CJ Advs

ఆ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తనకి క్రికెటర్స్ లో కోహ్లీ అంటే స్ఫూర్తి అని చెప్పింది. మహీందర్ సింగ్ ధోని అంటే ఇష్టమని, తనకి ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో కోహ్లీ తన కెరీర్ లో 71 వ సెంచరీ చేసినప్పుడు ఏడ్చేసానని చెప్పింది. ముప్పేట దాడిని ఎదుర్కుంటూ ఫామ్ కోల్పోయిన సమయంలో సెంచరీ కొట్టడం అమోఘమని, ఇది నిజంగా స్ఫూర్తి దాయకమని చెప్పింది. 

అంటే సమంత ఉద్దేశ్యం ప్రకారం సమంత ముప్పేట దాడిని ఎదుర్కుంటూ ధైర్యంగా నిలబడి మళ్ళీ పుంజుకుని కెరీర్ లో ముందుకెళ్లడమే గొప్ప అని చెప్పకనే చెప్పింది. తన కెరీర్ కూడా ఎత్తుపల్లాలని చూసినట్లుగా సమంత తరచూ చెబుతూనే ఉంటుంది.

Samantha said Virat Kohli is an inspiration:

 Samantha Prabhu Said Virat Kohli Is an Inspiration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs