Advertisement
Google Ads BL

ఇకపై జబర్దస్త్ లో కనిపించడం కష్టమే


సుడిగాలి సుధీర్ కి లైఫ్ నిచ్చిన జబర్దస్త్ అతను బుల్లితెర పై బాగా పాపులర్ కావడానికి హెల్ప్ అయ్యింది. జబర్దస్త్ షో లో టీమ్ లీడర్ గా తన ఫ్రెండ్స్ శ్రీను, రామ్ ప్రసాద్ లతో కలిసి కామెడీ చేస్తూ ఢీ డాన్స్ షో స్టేజ్ పై రష్మీ తో కలిసి లవ్ ట్రాక్ నడుపుతూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో బాగా ఫెమస్ అయ్యాడు. ఆ తర్వాత బుల్లితెర మీద షోస్ చేస్తూ చేతి నిండా సంపాదిస్తూనే వెండితెర మీద కేరెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టాడు.

Advertisement
CJ Advs

ఆ తర్వాత హీరోగా టర్న్ అయిన సుడిగాలి సుధీర్ సాఫ్ట్ వేర్ సుధీర్, వాంటెడ్ పండుగాడు, 3 మంకీస్, గాలోడు సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే సుడిగాలి సుధీర్ చేసిన సినిమాలేవీ సక్సెస్ అవ్వకపోయినా సుధీర్ కి మాత్రం బాగా పేరొచ్చింది. తాజాగా సుధీర్ పాగల్ దర్శకుడితో పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టాడు. ఇప్పటికే సుధీర్ నటించిన కాలింగ్ సహస్ర విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇప్పుడు #SS4 అంటూ సుధీర్ కొత్త సినిమా ఓపెనింగ్ చేసాడు.

ఇక హీరోగా ఇంత బిజీగా ఉంటున్న సుధీర్ ని జబర్దస్త్ స్టేజ్ పై మళ్ళీ చూడడం కష్టమనిపిస్తుంది. కానీ ఆయన ఫాన్స్ మాత్రం సుధీర్ ని మళ్ళీ జబర్దస్త్ స్టేజ్ పై కామెడీ చేస్తూ కనిపిస్తే చూడాలని బలంగా కోరుకుంటున్నారు. సుధీర్ ఇకపై బుల్లితెరపై కనిపించడనే  టాక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానితో ఆయన అభిమానులు డిస్పాయింట్ అవుతున్నారు. 

It is difficult to appear in Jabardasth anymore:

Sudigali Sudheer SS4 opening
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs