Advertisement
Google Ads BL

ఇప్పుడు మరింత రాటుదేలిపోయా: రష్మిక


రష్మిక కన్నడ నుండి టాలీవుడ్ కి రెక్కలు కట్టుకుని వాలిపోయి.. ఇప్పుడు ఇక్కడి హీరోయిన్స్ నే తొక్కేసి నెంబర్ 1 స్థానానికి అతి దగ్గరగా కూర్చుంది. ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుని కెరీర్ ని ఎంచుకుని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకుపోతున్న నటీమణి. రష్మిక పేరు సౌత్ లోనే కాదు నార్త్ లోనూ బాగా పాపులర్ అయ్యింది. హిందీలో పలు ప్రాజెక్టులు చేస్తూ జోరు మీదుంది. సినిమా షూటింగ్స్ తో బిజీగా వుంది ఎక్కే ఫ్లైట్ ఎక్కి.. దిగే ఫ్లైట్ దిగుతున్నా రష్మిక మాత్రం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఫోటో షూట్స్ మాత్రమే కాదు.. ఏ విషయమైనా సోషల్ మీడియా ద్వారానే షేర్ చేసుకుంటుంది.

Advertisement
CJ Advs

తాజాగా తన కెరీర్ ఆరంభంలో ఎదురైన చిన్న చిన్న సమస్యలకు బెదిరిపోయాను.. అప్పుడు ఆ సమస్యలు చూసి భయపడేదానిని. కానీ ఇపుడు అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకుని ప్రతి సమస్యని ఎదుర్కునే ధైర్యం వచ్చింది. అలోచించి అడుగు వేస్తె ప్రతి ప్రాబ్లెమ్ కి ఓ సొల్యూషన్ దొరుకుతుంది. అది గ్రహించి ఆలోచించి అడుగులు వేస్తున్నాను. దానితో సగం సమస్యలు తగ్గాయి. వరసగా సినిమాలు చేస్తున్నప్పుడు అలిసిపోయేదానిని.

పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ ఉండేది. సినిమా షూటింగ్స్ కోసం ప్రయాణాలు, ఇప్పుడు షూటింగ్స్ లో గతంలో కన్నా ఎక్కువగా బిజీగా గడుపుతున్నాను, కొత్త కొత్త సమస్యలు ఎదురయ్యే కొద్దీ గతంలో వచ్చిన సమస్యలు ఇప్పుడు అసలు సమస్యలే కాదు అనిపిస్తుంది అంటూ రష్మిక అప్పటికన్నా ఇప్పుడు మరింతగా రాటు దేలిపోయాను అంటూ చెప్పుకొచ్చింది.

Now even more rocked: Rashmika:

Rashmika Mandanna latest post viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs