Advertisement
Google Ads BL

ఇంత చేస్తున్నా బజ్ రావట్లేదు


నాగ చైతన్య కస్టడీ ప్రమోషన్స్ లో తెగ కష్టపడుతున్నాడు. ఉదయం వైజాగ్, సాయంత్రం చెన్నై, మళ్ళీ ఉదయం హైదరాబాద్ అంటూ అప్ డౌన్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ్ మీడియాతో మాట్లాడుతూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. కృతి శెట్టి హీరోయిన్, అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అయితే నాగ చైతన్య తో పాటుగా అప్పుడప్పుడు కృతి శెట్టి మాత్రం ప్రమోషన్స్ లో కనిపిస్తుంది. అరవింద్ స్వామి మాత్రం అస్సలు కస్టడీ ప్రమోషన్స్ లోనే కనిపించలేదు.

Advertisement
CJ Advs

ఇక అక్కినేని హీరోలు వరస డిజాస్టర్స్ ఎఫెక్ట్, నాగ చైతన్యకి థాంక్యూ డిసాస్టర్ ఎఫెక్ట్ ఉండడంతో కస్టడీపై బజ్ క్రియేట్ అవడం లేదు. 22 కోట్ల టార్గెట్ తో నాగ చైతన్య బాక్సాఫీసు బరిలోకి దిగుతున్నాడు. చైతు కస్టడీకి ఎటువైపు నుండి పెద్దగా పోటీ లేదు. తెలుగు నుండి చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి. అటు తమిళనాట అంతే. పోటీ లేకపోయినా ప్రేక్షకుల్లో కస్టడీపై ఆసక్తి క్రియేట్ అవ్వడం లేదు అని బుక్ మై షో చూస్తే కస్టడీ బుకింగ్స్ ఎంత వీక్ గా ఉన్నాయో తెలిసిపోతుంది. రేపు విడుదల కాబోతున్న కస్టడీ బుకింగ్స్ అంతగా కనిపించడం లేదు. సినిమా బావుంటే చూద్దాంలే అని ప్రేక్షకులు అనుకుంటున్నారేమో.. అంటే కస్టడీ టాక్ ని బట్టి థియేటర్స్ కి ప్రేక్షకులు కదిలేలా కనబడుతున్నారు.

నాగ చైతన్య, వెంకట్ ప్రభు కస్టడీపై నమ్మకంతో ఉన్నారు. ఇక కస్టడీ మలయాళ హిట్ ఫిల్మ్ నాయట్టుకి రీమేక్ లేదా దానికి ఇన్స్పైర్ అయ్యి తీసారేమో అంటుంటే.. వెంకట్ ప్రభు మాత్రం అలాంటిదేం లేదు.. ఇది ఒరిజినల్. రేపు కస్టడీ చూడండి అంటున్నారు. చూద్దాం కస్టడీ రిజల్ట్ ఏమిటనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది.

Low Buzz in Naga Chaitanya Custody:

Week Booking in Naga Chaitanya Custody
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs