Advertisement
Google Ads BL

UBS : పవన్ పవర్ ఫుల్ లుక్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో గబ్బర్ సింగ్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఇదే కాంబో రిపీట్ అవడంతో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ గా రాబోతున్న పవన్ కళ్యాణ్-హరీష్ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తయ్యిందో.. లేదో.. ఆ ఎపిసోడ్ నుండి గ్లిమ్ప్స్ రెడీ చేసాడు హరీష్ శంకర్. అయితే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో తేరి రీమేక్ చేస్తున్నాడని పవన్ ఫాన్స్ హరీష్ పై పగబట్టారు. ట్రోల్ చేసారు.

Advertisement
CJ Advs

దానితో హరీష్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని పవన్ ఫాన్స్ మెచ్చేలా చెయ్యాలని ఛాలెంజింగ్ గా తీసుకుని ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఫాన్స్ లో ఇంట్రెస్ట్ కలిగించాడు. ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ పోస్టర్ తో సహా టైటిల్ రివీల్ చేసాడు. ఇప్పుడు ఈ రోజు మే 11 న గ్లిమ్ప్స్ రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఫాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఈరోజు సాయత్రం 4 గంటలకి గ్లిమ్ప్స్ ఇచ్చేలోపే ఉస్తాద్ నుండి  పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోస్టర్ వదిలాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ గా పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న పవన్ కళ్యాణ్ తాజా పోస్టర్ ని చూసి ఫాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. అస్సలు ఊహించలేదు పవన్ ని ఇంత స్టైలిష్ గా అంటూ కామెంట్ చేస్తున్నారు. పోలీస్ డ్రెస్ కాకుండా ఫార్మల్ లుక్ లోనే బారి గేట్ పై చెయ్యి వేసి పవన్ స్టయిల్ గా నించున్న పిక్ అది. పవర్ స్టార్ స్టయిల్ కి ఫాన్స్ మాత్రం ఫిదా అవడమే కాదు.. హరీష్ ని ట్రోల్ చేసినందుకు సారి కూడా చెబుతారేమో చూడాలి.

Ustad Bhagat Singh: Pawan breathes fire with swag:

Ustaad Bhagat Singh: Pawan Powerful poster before Glimpse
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs