Advertisement
Google Ads BL

ఏ హీరో హెల్ప్ తీసుకోని చైతు


నాగ చైతన్య కస్టడీ ప్రమోషన్స్ లో సింగిల్ గా కష్టపడుతున్నాడు. నాగార్జున కూడా నాగ చైతన్య కస్టడీ ప్రమోషన్స్ కి రాలేదు. అఖిల్ ఏమో ఏజెంట్ డిసాస్టర్ మూడ్ లో సతమతమవుతున్నాడు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా నాగ చైతన్య ఏ హీరో హెల్ప్ తీసుకుని గెస్ట్ గా పిలుచుకురాలేదు. కేవలం కృతి శెట్టి, దర్శకుడు వెంకట్ ప్రభుతోనే ప్రమోషన్స్ చుట్టేస్తున్నాడు. ముఖ్యంగా సింగిల్ హ్యాండ్ తోనే నాగ చైతన్య కస్టడీని ప్రమోట్ చేస్తున్నాడు. థాంక్యూ డిసాస్టర్ అవుతుంది అని ముందే తెలిసి ప్రమోట్ చేసాము, నిర్మాత సేఫ్ అవ్వాలని అంటూ నాగ చైతన్య చెప్పడం ఈ ప్రమోషన్స్ లో అందరిని ఆకర్షించింది.

Advertisement
CJ Advs

మరోపక్క సమంత విడాకులపై, అతని డేటింగ్ రూమర్స్ పై ఎదురవుతున్న ప్రశ్నలకి థాంక్యూ ప్రమోషన్స్ లో తప్పించుకున్న నాగ చైతన్య కస్టడీ ప్రమోషన్స్ లో మాత్రం సామ్ తో డివోర్స్, శోభిత దూళిపాళ్ల తో డేటింగ్ రూమర్స్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చుకుంటూ పోతున్నాడు. అలానే సినిమాపై సింగిల్ గానే అంచనాలు పెంచుతున్నాడు. అటు తమిళనాట కూడా టివి ఇంటర్వూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ నాగ చైతన్య ఒంటరిగానే పోరాడుతున్నాడు.

కనీసం నాగార్జున హెల్ప్ కూడా నాగ చైతన్య తీసుకోలేదో.. లేదంటే నాగార్జునే మీడియాని అవాయిడ్ చేసారో కానీ.. చైతు మాత్రం ఎవ్వరి నుండి అంటే ఏ హీరో హెల్ప్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తీసుకోలేదు. మరి రేపు శుక్రవారం చైతు కస్టడీ రిజల్ట్ ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు.

Chaitu take any hero help:

Naga Chaitanya single handed promotions in Custody
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs