Advertisement
Google Ads BL

ఏంటా స్పీడు పవన్..


పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్రేకుల్లేని బండిలా కనిపిస్తున్నారు. వరస సినిమా షూటింగ్స్.. అందులోను గ్యాప్ లేకుండా షూటింగ్స్ కి హాజరవడంతో పవన్ ఫాన్స్ కూడా నమ్మలేకపోతున్నారు. నాలుగు సినిమాల షూటింగ్స్ ఏక కాలంలో పూర్తి చేస్తున్నారు అంటే నిజంగా పవన్ కళ్యాణ్ విషయంలో అది నమ్మలేని నిజమే. ఎందుకంటే ఆయన చాలా స్లోగా షూటింగ్స్ చేస్తారు. మధ్యలో రాజకీయాలతో బ్రేకులు పడుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు రాజకీయాలని అన్న నాగబాబు చేతిలో పెట్టి పవన్ ఫోకస్ మొత్తం సినిమాకులపైనే పెట్టారు.

Advertisement
CJ Advs

ఇప్పటీకే సముద్రఖని PKSDT రెడీ అయిపోగా.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, OG షూటింగ్స్ తో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ముంబైలో, పూణే లో OG కి సంబందించిన రెండు లెంగ్తి షెడ్యూల్స్ ని పూర్తి చేసేసారు. OG నిర్మాత దానయ్య అయితే పవన్ కళ్యాణ్ తో షూట్ చేసిన షెడ్యూల్స్ గురించి ఎప్పటికప్పుడు హుషారుగా అప్ డేట్స్ ఇస్తున్నారు. నిన్న నైట్ OG లెంగ్తి షెడ్యూల్ ఫినిష్ అంటూ ఓ పిక్ తో పాటుగా అప్ డేట్ ఇచ్చారు.

ఇకపై పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ లోకి దిగిపోతారు. రేపు సాయంత్రం ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ ఇవ్వబోతున్నారు. ఇదంతా చూస్తుంటే ఏంటి పవన్ ఆ స్పీడు అనేలా ఉంది ఆయన సినిమాల అప్ డేట్స్.. యవ్వారం.

OG: Pawan Kalyan wraps lengthy schedule:

OG done with a long schedule
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs