Advertisement
Google Ads BL

గేమ్ ఛేంజర్ పై పవర్ ఫుల్ అప్ డేట్


రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ పై మేకర్స్ కన్నా ముందే దర్శకుడు శంకర్ ప్రతి షెడ్యూల్ అప్ డేట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగా ఫాన్స్ కి కిక్ ఇస్తున్నారు. ఆయన అలా చెయ్యకపోతే మెగా ఫాన్స్ చేతిలో ఏమవుతుందో ఆయనకి బాగా అర్ధమై ఉంటుంది. ఎందుకంటే రామ్ చరణ్ తో RC15 అంటూ ట్రావెల్ చెయ్యడంట్ స్టార్ట్ చేసి రేపు ఆగష్టుకి రెండేళ్లు. కానీ మధ్యలో ఇండియన్ 2 రావడంతో శంకర్ అక్కడికి ఇక్కడికి అంటూ రెండు సినిమాల షూటింగ్స్ చేస్తూ వస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా శంకర్ చరణ్ గేమ్ ఛేంజర్ పై పవర్ ఫుల్ అప్ డేట్ ఇచ్చారు. Wrapped up #GameChanger electrifying climax today! Focus shift to #Indian2 silver bullet sequence from tomorrow! నిన్నటితో గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ మొత్తం పూర్తయ్యింది, ఈరోజు నుండి కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ షూట్ కి షిఫ్ట్ అవుతున్నట్లు శంకర్ ట్వీట్ చేసారు.

పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ చిత్ర టీజర్ కోసం మెగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే శంకర్ అతి త్వరలోనే గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ ని స్టార్ట్ చేయబోతున్నారని.. ముందుగా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చాకే మిగతా ప్రమోషన్స్ మొదలు పెడతారని తెలుస్తుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో SJ సూర్య విలన్ రోల్ పోషిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Powerful update on a Game Changer:

Game Changer climax shoot wrapped
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs