మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్లు రాజకీయాలంటూ తిరిగి తర్వాత సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక సేఫ్ గేమ్ ఆడుతున్నారనే వాదన గట్టిగానే వినిపిస్తుంది. ఎందుకంటే మెగాస్టార్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక ఎక్కువగా రీమేక్స్ చేసుకుంటూ పోతున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత గాడ్ ఫాదర్ చేసారు. మధ్యలో స్ట్రయిట్ కథలతో చేసిన సైరా, ఆచార్య రెండూ డిజాస్టర్స్ అయ్యాయి. మళ్ళీ గాడ్ ఫాదర్ రీమేక్ తో రేస్ లోకి వచ్చిన చిరంజీవి.. వాల్తేర్ వీరయ్యతో సూపర్ హిట్ కొట్టారు. అది స్ట్రయిట్ కథ.
కానీ మళ్ళీ తమిళంలో హిట్ అయిన వేదాళం ఇప్పుడు భోళా శంకర్ గా రీమేక్ చేస్తున్నారు. భోళా శంకర్ తర్వాత చిరు మరో రీమేక్ కి శ్రీకారం చుట్టారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మలయాళంలో మోహన్ లాల్-పృథ్వీ రాజ్ కాంబోలో వచ్చిన బ్రో డాడీ ని ఓ యంగ్ హీరోతో కలిసి రీమేక్ చెయ్యబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమన్నాయి. చిరు-యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ తో కలిసి బ్రో డాడీ రీమేక్ మెగాస్టార్ చేస్తున్నారంటున్నారు.
దానితో మెగా ఫాన్స్ గోల పెడుతున్నారు. మోహన్ లాల్-పృథ్వీ రాజ్ సుకుమారన్ కలయికలో వచ్చిన బ్రో డాడీ పెద్ద హిట్ కూడా కాదు.. అసలు మీకు రీమేక్స్ ఏమిటి సామి.. స్ట్రయిట్ కథలు చెప్పే దర్శకులు చాలామందే ఉన్నారు. అలాంటివి సేల్స్ చేసుకోమంటూ మెగా ఫాన్స్ మెగాస్టార్ కి రిక్వెస్ట్ లు పెడుతున్నారు. అయితే బ్రో డాడీ సినిమా విషయంలో అయితే ఎలాంటి నిజం లేదట. మెగాస్టార్ నెక్స్ట్ చేసే సినిమాలు స్ట్రయిట్ ప్రాజెక్ట్స్ గానే ఉండబోతున్నాయని తెలుస్తుంది.