Advertisement
Google Ads BL

హైదరాబాద్ లో సమంత కాస్ట్లీ ఫ్లాట్


సమంత కొద్దిరోజులుగా ముంబై టు హైదరాబాద్ అంటూ తాను చేస్తున్న సినిమా షూటింగ్స్ కోసం జర్నీ చేస్తుంది. హైదరాబాద్ లో గతంలో ఇల్లు లేని సమంత నాగ చైతన్య తో వివాహం తర్వాత మురళి మోహన్ ఇల్లు తీసుకుని అందులో కాపురం పెట్టినా.. విడిపోయాక సమంత మళ్ళీ కావాలని అదే ఇల్లుని ఎక్కువ ధరకి కొనుగోలు చేసినట్లుగా వార్తలొచ్చాయి. అటు తర్వాత సమంత ముంబైలో ఇల్లు కొనబోతుంది అంటూ ప్రచారం జరిగింది. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్ తర్వాత సమంతకి హిందీ ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి ఆమె అక్కడ కూడా ఇల్లు కొనాలి అనుకుంటుంది అన్నారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా సమంత హైదరాబాద్ మహానగరంలో కాకుండా హైదరాబాద్ చివారు ప్రాంతమైన ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లోని జయభేరి కౌంటీ గేటెడ్ కమ్యూనిటీలో ఓ కాస్ట్లీ విల్లా కొనుగోలు చేసినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఖరీదైన అపార్ట్మెంట్ లో 13 , 14 ఫ్లోర్స్ లో ఉన్న ఈ 3BHK డూప్లెక్స్ ఖరీదు 7.8 కోట్లు విలువ కడుతున్నారు. క్రేజీ హీరోయిన్ గా ప్యాన్ ఇండియా మూవీస్ తో కెరీర్ లో దూసుకుపోతున్న సమంత ఇప్పుడు ప్రోపర్టీస్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది.

ముంబైలోనే 18 కోట్లతో విలాసవంతమైన ఫ్లాట్ ని కొనుగోలు చేసిన సమంతకి ఇప్పుడు హైదరాబాద్ లో రెండు కాస్ట్లీ ఇళ్లు ఉండడం చూస్తే ఆమె ప్లానింగ్ ఎలా ఉందో తెలుస్తుంది. ప్రస్తుతం సమంత శాకుంతలం డిసాస్టర్ మోడ్ నుండి బయటికొచ్చేసి ఖుషితో విజయ్ దేవరకొండ, సిటాడెల్ సీరీస్ లో వరుణ్ ధావన్ తో రొమాన్స్ చేస్తూ షూటింగ్స్ తో బిజీగా మారింది.  

Samantha Costly Flat in Hyderabad:

Samantha buys 3 BHK duplex apartment worth Rs 7.8 crore in FInancial District
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs