మహేష్ బాబు ఏడాదిలో మూడు నాలుగుసార్లు ఫ్యామిలీతో విదేశాలకి వెకేషన్స్ కి వెళ్ళిపోతారు. సినిమా షూటింగ్స్ తో ఎంత బిజీగా వున్నా ఆయన అనుకున్న ప్లానింగ్ లో ట్రిప్ జరిగిపోతుంది. ఇక్కడ దర్శకులు, నిర్మాతలు ఆయన కోసం వెయిట్ చేస్తున్నా మహేష్ ప్లానింగ్ లో ఎలాంటి మార్పు ఉండదు. పిల్లలతో ఏడాదిలో ఇలా రెండుమూడుసార్లు సమయం గడిపేందుకే విదేశాలకు మహేష్ ప్లాన్ చేసుకుంటారని అంటూ ఉంటారు. కానీ ఈ మధ్యన వినిపిస్తున్న టాక్ మరోలా ఉంది.
మహేష్ బాబు అందాన్ని ఇంకా మెరుగులపరుచుకోవడానికి విదేశాల్లో ప్రక్రుతి వైద్యం తీసుకుంటారని, అలాగే ఆయన ఏ చిన్న ప్రాబ్లెమ్ అయినా దుబాయ్, స్పెయిన్ లాంటి దేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారని.. తాజాగా ఓ స్పెషల్ ట్రైనింగ్ కోసం కూడా మహేష్ ఈ విదేశీ ట్రిప్ ని వాడేస్తారని తెలుస్తుంది. మహేష్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో స్పెయిన్ లో స్పెండ్ చేస్తున్నారు. మెంటల్, ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం స్పెయిన్‌లో నిర్వహిస్తోన్న స్పెషల్ ట్రైనింగ్ కోసమని ఆయన తన ముగ్గురు, నలుగురు టీమ్‌తో స్పెయిన్‌లో గడుపుతున్నారట.
మే 15 వరకు మహేష్ కి ఈ స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందని సమాచారం. మరి ఫ్యామిలీతో ఎంజాయ్ చెయ్యడానికే మహేష్ స్పెయిన్ వెళ్లడం లేదు. ఆయన అక్కడ తన ఫిట్ నెస్ ని, అలాగే అందాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా విదేశాలకు వెళుతుంటారని దీనర్ధం.