Advertisement
Google Ads BL

నవ్యతో పెళ్లిపై రవికృష్ణ రియాక్షన్


సీరియల్ ఆర్టిస్ట్ రవికృష్ణ బిగ్ బాస్ తర్వాత సినిమాలతో ఫెమస్ అయ్యాడు. జీ తెలుగు సీరియల్స్, స్టార్ మా సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకి దగ్గరైన రవికృష్ణ ఆతర్వాత స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ లో తన ప్రత్యేకతని చూపించి టివి ఆడియన్స్ కి ఇంకాస్త చేరువయ్యాడు. తర్వాత వెండితెర మీద బిజీ అయ్యాడు. తాజాగా విరూపాక్ష లో మంచి రోల్ పోషించి ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకున్నాడు.

Advertisement
CJ Advs

అయితే రవికృష్ణ బుల్లితెర నటి నవ్య స్వామి పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ ఎప్పటినుండో ప్రచారం లో ఉంది. కారణం వీరిద్దరూ కలిసి సీరియల్స్ లో నటించడమే కాదు.. ఎక్కడ చూసినా వీరిద్దరూ జంటగా క్లోజ్ గా కనిపించేసరికి అందరూ వీరు లవర్స్ ఏమో.. పెళ్లి కూడా చేసుకుంటారేమో అనే భ్రమలో ఉన్నారు. కానీ వీరు మాత్రం మేము ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో రవికృష్ణ నవ్య స్వామితో ఫ్రెండ్ షిప్, ప్రేమ, పెళ్లిపై జరుగుతన్న ప్రచారంపై స్పందించాడు.

మేమిద్దరం టివి లో చివరిగా సీరియల్ చేశాము. ఏదైనా షోకి పిలవాలనుకున్నప్పుడు.. దానికి ఓ పాపులర్ ఒక జంట కావాలనుకున్నప్పుడు, మాది హిట్ పెయిర్ కావడంతో పిలిచేవారు. అది చూసిన ప్రేక్షకులు కూడా వీరిద్దరే పెయిర్ అని ఫీలయ్యారు. తనకు, నాకు కంఫోర్ట్ జోన్ కావడంతో కంటిన్యూ అయ్యాం. అయినా మేము బెస్ట్ ఫ్రెండ్, చూసేవాళ్లకేమో లవర్స్ అన్న ఫీలింగ్.. అందులోనే వారికి సంతోషం అంటూ మాట్లాడిన రవికృష్ణ రోజూ నవ్యతో ఫోన్ టచ్ లో ఉంటానని చెప్పుకొచ్చాడు.

Ravi Krishna reaction on marriage with Navya:

Ravi Krishna reaction on marriage with Navya Swamy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs