Advertisement
Google Ads BL

NTR30 : జిమ్ లో జాన్వీ కపూర్ కసరత్తులు


శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీపై నడిచిన ఉత్సుకత, ప్రచారం ఏ హీరోయిన్ కి జరగలేదు. ఇదిగో జాన్వీ కపూర్ తెలుగులో నటిస్తుంది, పూరి జగన్నాథ్ ఆమెని సౌత్ కి విజయ్ దేవరకొండ హీరోగా పరిచయం చెయ్యబోతున్నాడు అంటూ ఏవేవో ఊహాగానాలు నడిచినా చివరికి అలియా భట్ హ్యాండ్ ఇవ్వడంతో కొరటాల శివ #NTR30 కోసం జాన్వీ కపూర్ ని సౌత్ లోకి తీసుకొస్తున్నాడు. ఇప్పటివరకు జాన్వీ కపూర్ కి హిట్ లేకపోయినా.. ఆమెకి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది.

Advertisement
CJ Advs

జాన్వీ కపూర్ జిమ్ లో చేసే వర్కౌట్స్ కన్నా ఆమె జిమ్ కోసం వేసే అవుట్ ఫిట్స్ బాగా పాపులర్ చేసాయి. గ్లామర్ విషయంలో అందాలు ఆరబోసే విషయంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయే జాన్వీ కపూర్ తాజాగా జిమ్ లో కష్టపడిపోతూ కనిపించింది. బాడీ షేప్, ఫిట్ నెస్ కోసం జాన్వీ కపూర్ వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. ఇక #NTR30 షూట్ లో పాల్గొనేందుకు జాన్వీ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

ఎన్టీఆర్ తో నటించాలనే కలను నిజం చేసుకుంటున్న జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తుందా.. ఎప్పుడెప్పుడు షూటింగ్ లో పాల్గొంటుందో అని ఎన్టీఆర్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా జాన్వీ కపూర్ మనీష్ మల్హోత్రా బ్లాక్ అవుట్ ఫిట్ లో అందాలు చూపించేసింది. ఆ పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. 

NTR30 : Janhvi Kapoor exercises in the gym:

Janhvi Kapoor Workout At Gym On NTR 30 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs