Advertisement
Google Ads BL

బాలీవుడ్ లో పూజకి బంపర్ ఆఫర్


పూజా హెగ్డే కి బాలీవుడ్ అస్సలు కలిసి రావడం లేదు. ఆమె మొదటి సినిమా హ్రితిక్ రోషన్ తో చేస్తే అది డిసాస్టర్. ఆ తర్వాత సౌత్ లోకి అడుగుపెట్టి టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరింది. సౌత్ లో అందులోనూ తెలుగులో వరస హిట్స్ తో స్టార్ హీరోలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. వరస సక్సెస్ లు అందుకుంది. ఆ తర్వాత మళ్ళీ ముంబైలో అడుగుపెట్టింది. రన్వీర్ సింగ్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తో సర్కస్ చేస్తే అది డిసాస్టర్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఇక ఈ ఏడాది సల్మాన్ ఖాన్ ని నమ్ముకుని కిసి కా భాయ్ కిసి కా జాన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే మళ్ళీ పూజా హెగ్డే ని నార్త్ ఆడియన్స్ తిరస్కరించారు. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ తో పూజా హెగ్డే సతమతమవుతోంది. హిందీలో ఇటు సౌత్ లో చూసుకుంటే పూజకి కేవలం మహేష్ సినిమా మాత్రమే ఉంది. అయితే తాజాగా పూజా హెగ్డే కి హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీలో ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. 

రోషన్ ఆంద్రుస్ దర్శకత్వంలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ రూపొందనున్న ఈ చిత్రానికి కోయి షాక్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసేసారట మేకర్స్. ఈ చిత్రంలోనే పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందట. అంతేకాకుండా మరో రెండు హిందీ ప్రాజెక్ట్స్ కి పూజా హెగ్డే సైన్ చేసింది అంటున్నారు.

Pooja Hegde To Romance Shahid Kapoor :

Shahid Kapoor and Pooja Hegde to star in Thriller Koi Shaq
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs