Advertisement
Google Ads BL

మహేష్ స్పెషల్ ఫోటోషూట్?


మహేష్ బాబు ప్రస్తుతం #SSMB28 షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో విదేశీ ట్రిప్ లో వేసవి సెలవలని ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ ట్రిప్ నుండి మహేష్ ఈ నెల 16 కానీ 18 కానీ హైదరాబాద్ కి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మే 31 కృష్ణగారి జయంతి రోజున మహేష్ కొత్త సినిమాల నుండి ప్రతిసారి సర్ ప్రైజ్ ఘట్టమనేని అభిమానులకి అందినట్టుగానే ఈ ఏడాది కూడా మహేష్ #SSMB28 నుండి స్పెషల్ ట్రీట్ ఇస్తామని నిర్మాత నాగ వంశీ ఎప్పుడో మహేష్ ఫాన్స్ కి చెప్పి ఊరిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

అయితే #SSMB28 టైటిల్ తో పాటుగా స్పెషల్ గ్లిమ్ప్స్ కృష్ణగారి జయంతికి ఇచ్చే ప్లాన్ త్రివిక్రమ్ చేస్తున్నారట. అందులో భాగంగానే టైటిల్ పోస్టర్ కోసం మహేష్ విదేశాల నుండి తిరిగిరాగానే ఓ స్పెషల్ ఫోటోషూట్ త్రివిక్రమ్ చేయించబోతున్నట్లుగా తెలుస్తుంది. మహేష్ హైదరాబాద్ కి వచ్చాక రెండురోజుల్లో త్రివిక్రమ్ చేయించబోయే ఫోటో షూట్ లో పాల్గొంటారని.. ఈనెల చివరి నుండి అయినా లేదంటే జూన్ మొదటి వారం నుండి అయినా #SSMB28 కొత్త షెడ్యూల్ మొదలయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.

పూజా హెగ్డే-శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు మాసివ్ విలనిజాన్ని చూపించబోతున్నట్టుగా ఆయనే ఈ మధ్యన ఓ సినిమా ప్రమోషన్స్ లో రివీల్ చేసారు. ఇంకా ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Mahesh Babu shoot for a special treat:

Mahesh Babu SSMB28 update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs