Advertisement
Google Ads BL

పుష్ప 2 షూటింగ్ సందడి షురూ


ఫైనల్లీ పుష్ప ద రూల్ రెస్యూమ్ షూట్ మారేడుమిల్లి ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో మొదలయ్యింది. రెండు వారాల క్రితం ఐటి దాడులతో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్లు పుష్ప ద రూల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా, ఫహద్ ఫాసిల్ విలన్ గా పుష్ప రెండో భాగం తెరకెక్కుతుంది. గత నెలలోనే ఫహద్ ఫాసిల్ పుష్ప 2 సెట్స్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక ఇప్పుడు మారేడుమిల్లు ఫారెస్ట్ ఏరియాలో పుష్ప 2 షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలయ్యింది. 

Advertisement
CJ Advs

ఈ షెడ్యూల్ లో ఫహద్ ఫాజిల్ మీద సుకుమార్ కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేపట్టినట్లుగా తెలుస్తుంది. మారేడుమిల్లు ఏరియాలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన సుకుమార్ తదుపరి షెడ్యూల్ ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులోని ఫారెస్ట్ లో డిజైన్ చేసారు. ఇప్పటికే అక్కడి లొకేషన్స్ సెట్ చేసుకోవడం, అక్కడి అధికారుల అనుమతులు తీసుకోవడం అన్ని పూర్తయ్యాయి. ఈ షెడ్యూల్ లో రష్మిక మందన్న కూడా పాల్గొనబోతుంది.

అయితే మెగా డాటర్ నిహారిక పుష్ప పార్ట్ 2 లో స్పెషల్ రోల్ చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి కానీ.. ఈ విషయమై చిత్ర బృందం నుండి ఎలాంటి ప్రకటన అయితే లేదు.

The shooting of Pushpa 2 is buzzing:

Pushpa The Rule Shooting Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs