Advertisement
Google Ads BL

ఇకపై అక్కినేని కాపాండ్ లోకి నో ఎంట్రీ


అక్కినేని ఫ్యామిలిలో ముగ్గురు స్టార్ హీరోలు.. ఇద్దరు చిన్న హీరోలు ఉన్నారు. నాగార్జున ఇప్పటికీ స్టార్ డైరెక్టర్స్ తోనే పని చేస్తున్నారు. నాగ చైతన్య-అఖిల్ కి ప్రస్తుతం సక్సెస్ లేకపోయినా.. పెద్ద ఫ్యామిలీ హీరోస్ గనక దర్శకులు ఆ హీరోలతో పని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇప్పుడో దర్శకుడు అసలు అక్కినేని కాంపౌండ్ లోకి ఎంట్రీ కోల్పోయినట్లే కనిపిస్తుంది. 

Advertisement
CJ Advs

అతనే పరశురామ్. నాగ చైతన్యతో సినిమా ప్రకటించి నాగ చైతన్యని వెయిట్ చేయించి మహేష్ ఆఫర్ రాగానే మహేష్ తో సినిమా చేసేసాడు. దానితో నాగ చైతన్యకి మండింది. కష్టడి ప్రమోషన్స్ లో పరశురామ్ వలన టైమ్ వేస్ట్ అయ్యింది, అలాంటి వాళ్ళు గురించి మాట్లాడుకోవడం కూడా టైమ్ వేస్ట్ అంటూ నాగ చైతన్య మాట్లాడాక ఇకపై అక్కినేని హీరోలతో పరశురామ్ కి ఛాన్స్ దొరుకుతుందా.. నాగార్జున పరశురామ్ కి తన కొడుకులతో సినిమా చేసే ఛాన్స్ రానిస్తాడా అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏదో చిన్నా చితక హీరోలతో పెట్టుకుంటే సరే. 

లేదంటే పెద్ద ఫ్యామిలీ హీరోలతో.. అందులోనూ ఇద్దరు ముగ్గురు ఒకే కాంపౌండ్ లో ఉన్న హీరోలతో గొడవ పెట్టుకుంటే కెరీర్ ఏమవుతుంది. విజయ్ దేవరకొండ లాంటి హీరో దొరికాక ఒక్క హిట్ పడితే స్టార్ ఛాన్సెస్ అవే వస్తాయని పరశురామ్ అనుకుంటున్నాడేమో అందుకే చైతూని లైట్ తీసుకున్నాడు అంటున్నారు నెటిజెన్స్.

No entry into Akkineni compound:

Naga Chaitanya Reaction Does Huge Damage to Parasuram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs