మాయోసైటిస్ నుండి కోలుకుని సమంత విజయ్ దేవరకొండ తో ఖుషి మూవీ షూటింగ్, బాలీవుడ్ లో రాజ్ అండ్ DK తో సిటాడెల్ వెబ్ సీరీస్ చేస్తుంది. అయితే హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ రీమేక్ లో సమంత ఇండియా వెర్షన్లో నటిస్తుంది.. ఇప్పుడేమో ఆ ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ సీరీస్ హిందీ, ఇంగ్లీష్, కనడ, మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలై అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లో ఉంది.
మళ్ళీ దానికి రీమేక్ ఏమిటి, అందులో సమంత నటించడం ఏమిటి అనే కన్ఫ్యూజన్ లో ప్రేక్షకులు, అభిమానులు ఉంటే.. శాకుంతలం, తర్వాత సిటాడెల్ తో సమంతకి బిగ్ షాక్ తగలడం ఖాయమంటున్నారు మీడియా వాళ్ళు. కారణం ప్రియాంక చోప్రా సిటాడెల్ సీరీస్ కి అంతగా ఆదరణ దొరకలేదు. అయితే సమంతకి తాజాగా ఓ నెటిజెన్ ప్రియాంక చేసిన సిటాడెల్ తెలుగులో, హిందీలో వచ్చేసింది. మళ్ళీ అదే సిటాడెల్ ని ఎందుకు రీమేక్ చేస్తున్నారు అంటూ ప్రశ్నించాడు.
దాంతో నేను చేసేది రీమేక్ కాదని చెప్పింది సమంత. దానికి మరో నెటిజెన్ స్పందిస్తూ సిటాడెల్ సీరీస్ అన్ని భాషల్లోనూ తెరకెక్కుతుంది. ఇండియన్ వెర్షన్ లో సమంత-వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ప్రాంతాలకు తగినట్లుగా ఈ సీరీస్ లో మార్పులు చేస్తున్నారని కామెంట్ చెయ్యగానే ఆ కామెంట్ ని సమంత లైక్ చెయ్యడంతో అసలు సమంత చేస్తున్న సిటాడెల్ పై మబ్బులు విడిపోయాయి.