Advertisement
Google Ads BL

అఖండ 2 ప్లానింగ్ రివీల్డ్


బోయపాటి-బాలకృష్ణ కాంబో అంటేనే హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరు. వీరిద్దరి కాంబో బ్లాక్ బస్టర్ కాంబో. అందుకే ఈ కాంబోపై చిన్న న్యూస్ వినిపించినా, ఎలాంటి రూమర్ అయినా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. 2021 లో అఖండ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్య-బోయపాటిలు ఇప్పుడు ఆ అఖండ కి సీక్వెల్ అంటూ అందరిలో ఆసక్తిని, అంచనాలు రేపుతున్నారు.

Advertisement
CJ Advs

అది కూడా జూన్ 10 బాలయ్య బర్త్ డే రోజు అఖండ 2 పై అఫీషియల్ అనౌన్సమెంట్ వస్తుంది అనే న్యూస్ బాలయ్య ఫాన్స్ ని నిలవనియ్యడం లేదు. జూన్ 10 బాలయ్య బర్త్ డే కి అనౌన్సమెంట్ ఇచ్చి.. అక్టోబర్ నుంచి ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుని షూటింగ్ కి వెళ్తుంది అని టాక్ మొదలైంది. ఈలోపు బాలయ్య అనిల్ రావిపూడి తో చేస్తున్న #NBK108 మూవీ షూటింగ్, బోయపాటి రామ్ తో చేస్తున్న #BoyapatiRapo షూటింగ్ పూర్తి చేసుకుంటారు.

అఖండ 2 లో పొలిటికల్ అంశాలే మెయిన్ హైలైట్ గా ఉంటాయట. ఈ చిత్రంలోనూ బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తారని, ఆయన చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉండబోతున్నాయని, బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేసాడని అంటున్నారు. అఖండ 2 పై ఇలాంటి న్యూస్ లకి నందమూరి అభిమానులకి పూనకాలే అన్నట్టుగా ఉంది పరిస్థితి.

Akhanda 2 Planning Revealed:

Crazy news on Akhanda 2 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs