Advertisement
Google Ads BL

వరసగా రెండు డిజాస్టర్స్ : పాప పరిస్థితి?


డింపుల్ హయ్యతి తెలుగమ్మాయి. తెలుగు నుండి వచ్చే అమ్మాయిలు హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వరు అనే వాదనని డింపుల్ మరోసారి నిజం చేసింది. అందమైన లుక్స్, ఆకర్షణీయ రూపం, ఎనేర్జికి ఎనర్జీ, కాస్త నల్లగా ఉంటుంది అనే మాటే కానీ.. డింపుల్ హయ్యతి అందమైన అమ్మాయే. గ్లామర్ విషయంలో పొదుపు ఉండదు. ఎంతకావాలంటే అంత చూపించేస్తుంది. కానీ డింపుల్ కి కాలమే కలిసి రావడం లేదు.

Advertisement
CJ Advs

లక్కు అస్సలు కనిపించడం లేదు. రమేష్ వర్మ ఖిలాడీ సినిమాలో డింపుల్ హయ్యతిని గ్లామర్ గా చూపించాడు. డింపుల్ హయ్యతి చెయ్యాల్సింది చేసింది. డాన్స్ కూడా ఎనర్జిటిక్ గా చేసింది.. ఆకట్టుకుంది. కానీ ఆ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ డిసాస్టర్ గా మిగిలిపోయింది. తర్వాత ఎలాగో గోపీచంద్ రామబాణంలో శ్రీవాస్ గోపీచంద్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. హీరోయిన్ గా సాంగ్స్ లో ఆడిపాడింది. సినిమాలోనూ బాగానే కనిపించింది. కానీ సినిమానే ప్రేక్షకులకి రుచించలేదు. అవుట్ డేటెడ్ కథతో శ్రీవాస్ ప్రేక్షకులని శాటిస్ ఫై చెయ్యలేకపోయాడు.

ఈ దెబ్బకి డింపుల్ కి రామబాణం సినిమా మరో డిసాస్టర్ కట్టబెట్టింది. వరసగా రెండు డిజాస్టర్స్ ఉన్న పాపని ఏ హీరో మళ్ళీ తమ సినిమాలో ఛాన్స్ ఇస్తాడు. మరి డింపుల్ కెరీర్ కి రామబాణం హెల్ప్ చేస్తుంది అనుకుంటే అలా హెల్ప్ చెయ్యడం పోయి.. కెరీర్ ని మరింతగా డ్యామేజ్ చేసింది.

Two disaster in a row: What is the situation of the heroine?:

Two disasters in a row for Dimple Hayathi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs