నందమూరి బాలకృష్ణ మల్టీటాలెంటెడ్ పర్సన్. నటన మాత్రమే కాదు అప్పుడప్పుడు గొంతు సవరించుకుని పాటలు కూడా పాడుతూ ఉంటారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన చిత్రంలో బాలకృష్ణ ఏక్ పెగ్గులు అంటూ రెచ్చిపోయి పాటందుకున్నారు. ఇక తండ్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జగదేకవీరుని కథలోని శివ శంకరీ సాంగ్ పాడి అద్భుతంగా ఆకట్టుకున్నారు. తాజాగా బాలయ్య బాబు మరోసారి గొంతు సవరించారు.
స్టేజ్ పై క్లాసికల్ సాంగ్ ని అద్భుతంగా పాడి అక్కడి ప్రేక్షకులు లేచి చప్పట్లు కొట్టేలా చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నందమూరి బాలకృష్ణ ఖతార్ లోని దోహాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి అభిమానులు బాలయ్యని శివ శంకరి పాట పాడమని కోరగానే స్టేజ్ ఎక్కి బాలయ్య ఆ పాటని లైవ్ లో పాడడంతో ప్రేక్షకులు లేచి చప్పట్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఎనర్జీకి మారుపేరు అయిన బాలయ్య ఇంతకుముందు కూడా స్టేజ్ పై చాలాసార్లు పాటలు పాడారు. కానీ ఇంతగా వైరల్ అవ్వలేదు. ఆ వీడియో చూసిన బాలయ్య అభిమానులు బాలయ్య నువ్ గ్రేటయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.