Advertisement
Google Ads BL

పవన్ తో ఛాన్స్ కోసం వెయిటింగ్


కొన్నేళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ విజయ్ కనకమేడలతో సీరియస్ స్టోరీ నాంది మూవీ చేసి సక్సెస్ ట్రాక్ ఎక్కిన అల్లరి నరేష్ ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లు తో బిగ్గెస్ట్ డిసాస్టర్ అందుకున్నాడు. అయితే నాంది కన్నా ముందే మహేష్ తో కలిసి మహర్షితో స్క్రీన్ షేర్ చేసుకుని అందులో మహేష్ కి ఫ్రెండ్ గా నటించాడు. నాంది తో హిట్ ట్రాక్ ఎక్కిన అల్లరి నరేష్ అదే డైరెక్టర్ విజయ్ కనకమేడలతో ఉగ్రం చేసాడు. నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రం నేడు విడుదలైంది.

Advertisement
CJ Advs

పబ్లిక్ నుండి, క్రిటిక్స్ నుండి అల్లరి నరేష్ ఉగ్రనికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అల్లరి నరేష్ పెరఫార్మెన్స్ సూపర్ అంటూ ఆడియన్స్ నరేష్ ని పొగిడేశారు. BGM ఇరగదీసింది, క్లైమాక్స్ అదుర్స్ అంటూ ప్రేక్షకులు ఒపీనియన్ తో సోషల్ మీడియా నిండిపోయింది. ఇక ఉగ్రం సక్సెస్ సెలబ్రేషన్ అంటూ మేకర్స్ హడావిడి తర్వాత.. అల్లరి నరేష్ ట్విట్టర్ లో అభిమానులతో లైవ్ చాట్ కి దిగాడు.

అందులో ఓ అభిమాని పవన్ కళ్యాణ్ గారితో మూవీ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా అన్నా.. అని ప్రశ్నించగానే అల్లరి నరేష్ Chance kosam iam waitinggg… ఛాన్స్ కోసం నేనూ వెయిటింగ్ అంటూ ఆ అభిమానికి రిప్లై ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది. గతంలో మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న అల్లరి నరేష్ ఇప్పుడు పవన్ తో ఛాన్స్ వస్తే వదులుకుంటాడా.. అందుకే అంతగా వెయిట్ చేస్తున్నట్టుగా చెబుతున్నాడు.

Waiting for a chance with Pawan Kalyan:

Allari Naresh says Waiting for a chance with Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs