Advertisement
Google Ads BL

పూజ హెగ్డే-రష్మిక: ఇకపై టెన్షన్ టెన్షన్


లక్కీ హీరోయిన్స్ గా టాలీవుడ్ ని చుట్టేసిన పూజా హెగ్డే-రశ్మికలలో.. రష్మిక మధ్యలో కాస్త గ్యాప్ తో మళ్ళీ పుంజుకున్నా.. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి డిజాస్టర్స్ రూపంలో ఘోరంగా తయారైంది. గత ఏడాది నాలుగు భారీ డిజాస్టర్స్, ఈ ఏడాది హిందీలో మరో డిసాస్టర్ తో డిస్పాయింట్ మూడ్ లో ఉన్న పూజ హెగ్డే కి.. పుష్ప పాన్ ఇండియా మూవీ తప్ప సౌత్ లో సినిమాల్లేని రష్మిక మళ్ళీ మెల్లగా సౌత్ లో రెండు సినిమాల్ని ఓపెనింగ్ చేసి షూటింగ్ కి హాజరవుతున్న తరుణంలో మరో హీరోయిన్ వీరిద్దరికి చెక్ పెట్టేసింది.

Advertisement
CJ Advs

ఒకప్పుడు కృతి శెట్టి పూజా హెగ్డే-రష్మిక మందన్నలకి చెక్ పెట్టుద్ది అనుకుంటే.. ఆమెని వరస వైఫల్యాలు వెక్కిరించడంతో ఢీలా పడింది. ఈలోపు యంగ్ అండ్ ఎనర్జిటిక్ శ్రీలీల దూసుకొచ్చింది. వరస సినిమా ఆఫర్స్ తో శ్రీలీల ఒక్కసారిగా పాపులర్ అవడం కాదు.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తయారైంది. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు, సీనియర్స్ ఇలా ఎవ్వరిని వదలకుండా పది ప్రాజెక్టులకి సైన్ చేసి పూజ హెగ్డేకి రశ్మికకి హోల్సేల్ షాకిచ్చింది.

మహేష్, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, నితిన్, వైష్ణవ తేజ్, రామ్, బాలకృష్ణ అబ్బో శ్రీలీల చేతిలో ఫుల్ గా సినిమాలే సినిమాలు. ఇవన్నీ పూజా హెగ్డే-రష్మిక ఇద్దరిలో ఎవరో ఒకరికి దక్కాల్సిన ప్రాజెక్టులు. కానీ అవి శ్రీలీల కి దక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్ హీరోలంతా ప్రత్యేకంగా శ్రీలీల నామ జపం చేస్తున్నారనడానికి ఆమె చేతిలో ఉన్న సినిమాలే సాక్ష్యం. నిజంగా లక్ అంటే శ్రీలీలదే. ఈ రేంజ్ ఆఫర్స్ ఇప్పటివరకు ఏ హీరోయిన్ దక్కించుకోలేదనే చెప్పాలి.

వీటిలో ఏ మూడో నాలుగో సక్సెస్ అయినా చాలు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోల అవకాశాలు శ్రీలీల ఒడిలో వచ్చి వాలడం గ్యారెంటీ. దానితో పూజ హెగ్డే కి రష్మిక టెన్షన్ కాక మరేముంటుంది.

Pooja Hegde-Rashmika: tension tension:

Sreeleela craze forcing other actresses
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs