Advertisement
Google Ads BL

కుందనపు బొమ్మలా రాశి ఖన్నా


ఈమధ్యన రాశి ఖన్నా గ్లామర్ ఫోటో షూట్స్ కి యూత్ మైమరిచిపోతున్నారు. బాలీవుడ్ కి వెళ్లాకే గ్లామర్ గా మారలేదు. అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక గ్లామర్ రోల్స్ తోనే హైలెట్ అయ్యింది. ఎన్ని సినిమాలు చేసినా స్టార్ హీరోల పక్కన ఛాన్స్ మాత్రం పట్టలేకపోయింది. మీడియం రేంజ్ హీరోలతో సరిపెట్టుకున్న రాశి ఖన్నాకి సౌత్ అవకాశాలు తగ్గిపోయాయి. సౌత్ అవకాశాలు తగ్గుతున్న క్రమంలోనే ఆమెని బాలీవుడ్ వెబ్ సీరీస్ ఆదుకుంది. 

Advertisement
CJ Advs

రాజ్ అండ్ DK త్రయం దర్శకత్వంలో తెరకెక్కిన ఫార్జి వెబ్ సీరీస్ తో రాశి ఖన్నాకి మంచి పేరొచ్చింది. ఇందులో గ్లామర్ చూపించకపోయినా రాశి ఖన్నా పాత్ర ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. బబ్లీ గా ఉండే రాశి ఖన్నా నాజూగ్గా తయారైంది. సన్నబడినా గ్లామర్ కానీ మొహంలో కళని కానీ కోల్పోకుండా వర్కౌట్స్ తో బరువు తగ్గించేసింది. ఎప్పుడూ గ్లామర్ లుక్ నే చూపించే రాశి ఖన్నా ఇప్పుడు ట్రెడిషనల్ అవతారమెత్తింది.

ఆకుపచ్చ పట్టు చీరంలో ఏంజిల్ లా మెరిసింది. మెడ నిండా నగలతో, చెవులకి పెద్ద పెద్ద బుట్టలతో కుందనపు బొమ్మలా రాశి ఖన్నా ఇచ్చిన ఫోజులకి మతి పోవాల్సిందే. ఏంటో గ్లామర్ డాల్ ఈ గెటప్.. అయినా చూడచక్కగా ఉన్నావులే అంటూ ఆమె అభిమానులే కాదు నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా రాశి ఖన్నాని ఇలాంటి లుక్ లో చూస్తే వావ్ ఏముందిరా రాశి అని అనకుండా ఉండలేరు.

Raashi Khanna Traditional Avatar:

Raashi Khanna Beautiful Pose In Green Saree
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs