Advertisement
Google Ads BL

ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ వైఫ్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పెళ్లాడిన లక్ష్మి ప్రణతి పబ్లిక్ లోకి ఎక్కువగా ఫోకస్ అవ్వదు. మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ భార్యల మాదిరిగా సోషల్ మీడియాలో లక్ష్మి ప్రణతి హడావిడి చెయ్యదు. ఎన్టీఆర్ పెద్దలు కుదిర్చిన ప్రణతి మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచి ఈ రోజు మే 5 కి 12  ఏళ్ళు అవుతుంది. ఈ రోజు ఎన్టీఆర్-లక్ష్మి ప్రణతి పెళ్లి రోజు కావడంతో ఎన్టీఆర్ అభిమానులు వదినమ్మ లక్ష్మి ప్రణతి కి విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో #Pranathi పేరుని ట్రెండ్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ కి ఇద్దరు అబ్బాయిలు. అభయ్  రామ్, భార్గవ్ రామ్. అయితే ఎన్టీఆర్ కి రెండో బేబీ గా పాప కావాలని అటు ఎన్టీఆర్ ఇటు ప్రణతి బాగా కోరుకున్నారట. కానీ రెండోసారి కూడా అబ్బాయి పుట్టేసరికి ఎన్టీఆర్-ప్రణతి ఇద్దరూ బాగా డిస్పాయింట్ అయ్యారట. ఇక ఎన్టీఆర్ కూడా తన ఫ్యామిలీ తో లో ప్రొఫైల్ ని మెయింటింగ్ చేస్తూ ఉంటాడు. ఫ్యామిలీ ఈవెంట్స్, అలాగే బయట కూడా చాలా రేర్ గా కనిపించే లక్ష్మి ప్రణతి నందమూరి కోడలిగా అడుగుపెట్టి 12 ఏళ్ళు అయ్యింది.

ఎన్టీఆర్-ప్రణతి యానివర్సరీకి అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి సినీజోష్ టీం తరపున ఈ క్యూట్ కపుల్ కి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు చెప్పేద్దాం.. ఏ వెరీ హ్యాపీ యానివర్సరీ ఎన్టీఆర్ అండ్ లక్ష్మి ప్రణతి.

NTR wife Pranathi trending on social media:

NTR - Pranathi wedding anniversary
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs