Advertisement
Google Ads BL

ఏజెంట్ డిసాస్టర్ బాధ మరిపించేలా..


ఏజెంట్ తో బిగ్గెస్ట్ డిసాస్టర్ కొట్టి డిస్పాయింట్ మూడ్ లో ఉన్న AK ఎంటెర్టైనెంట్ వాళ్ళు ఇప్పడు ఆ బాధని మర్చిపోయేలా చేసే ప్లాన్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. అఖిల్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీని భారీగా తెరకెక్కిస్తే ఆ మూవీని ప్రేక్షకులు తిరస్కరించడంతో ఘోరమైన డిసాస్టర్ లిస్ట్ లోకి ఏజెంట్ వెళ్ళిపోయింది. ఏజెంట్ ప్లాప్ కి బాధ్యత వహిస్తూ అనిల్ సుంకర ట్వీట్ కూడా చేసి ప్రేక్షకులని క్షమాపణ కోరారు.

Advertisement
CJ Advs

అయితే ఏజెంట్ మూడ్ లో నుండి బయటపడేందుకు ఏకే ఎంటర్టైన్మెంట్ వాళ్ళు భోళా శంకర్ అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టేసారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరు నటిస్తున్న భోళా శంకర్ కొత్త షెడ్యూల్ కోసం టీమ్ మొత్తం కలకత్తా వెళ్ళింది. నిన్న బుధవారం కలకత్తాలో ఫ్లైట్ దిగినప్పటినుండి మెగాస్టార్ చిరు.. మెహర్ రమేష్ తో కలిసి భోళా శంకర్ సెట్స్ లో చేస్తున్న సందడి ప్రతీది అప్ డేట్ రూపంలో మేకర్స్ అందించే ప్లాన్ చేస్తున్నారు.

చిరు భోళా శంకర్ గా వింటేజ్ లుక్ లో కారులో ఉన్న పిక్స్, బ్లూ షర్ట్ తో సెట్స్ లో ఉన్న పిక్స్, ఇంకా ఎయిర్ పోర్ట్ వీడియో అంటూ సోషల్ మీడియాలో మేకర్స్ చేస్తున్న హడావిడి చూస్తుంటే ఏజెంట్ డిసాస్టర్ బాధ మరిచిపోవడానికి ఇలా భోళా శంకర్ లుక్స్ వదులుతూ అభిమానుల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ తో కాస్త రిలాక్స్ అవుతున్నారేమో అనిపిస్తుంది.

Agent Disaster makes you forget the pain..:

Bhola Shankar updates: Surprise fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs