Advertisement
Google Ads BL

నాజూగ్గా మారి అందం పోగొట్టుకున్న మెహ్రీన్


మెహరీన్ కౌర్.. బబ్లీగా చూడముచ్చటగా వరస సినిమా ఆఫర్స్ తో కళకళలాడిన ఆమెకి ఇప్పుడు చేద్దామంటే సినిమా లేకుండా పోయింది. కెరీర్ కోసం నిశ్చితార్ధాన్ని బ్రేక్ చేసుకుని పెళ్లి రద్దు చేసుకున్న మెహ్రీన్ ని టాలీవుడ్ లైట్ తీసుకుంటుంది. అనిల్ రావిపూడి తో వరస సినిమాలు చేసిన మెహ్రీన్ బబ్లీగా ఉన్నప్పుడే అందంగా, ఆకర్షణగా కనిపించేది. F3 తర్వాత కనిపించకుండా పోయిన మెహ్రీన్ కౌర్ తాజాగా చిక్కిపోయి కనిపించింది.

Advertisement
CJ Advs

చాలామంది హీరోయిన్స్ బరువు తగ్గించుకోవడానికి విపరీతంగా వర్కౌట్స్ చేసి బరువుతో పాటుగా అందాన్ని పోగొట్టుకుంటున్నారు. మహానటి బరువు తగ్గించుకోవడానికి కీర్తి సురేష్ చేసిన వర్కౌట్, యోగ అంతా ఆమె బరువు తగ్గించి మరీ మోహంలో కళను పోగొట్టేశాయి. కీర్తి సురేష్ నాజూగ్గా తయారై అందాన్ని పోగొట్టుకుంది. రాశి ఖన్నా సన్నబడినా.. మోహంలో గ్లోని మెయింటింగ్ చేస్తుంది. కానీ ఇప్పుడు మెహరీన్ కౌర్ సన్నబడి సైజు జీరోకి మారిపోయింది. కానీ బరువు తో పాటుగా ఆ ఫేస్ లో ఉండాల్సిన కళ కూడా మాయమైంది.

చక్కని రూపంతో బబ్లీగా ఆకర్షణగా కనిపించే మెహ్రీన్ కౌర్ సన్నిబడిపోయి, మొహం సాగిపోయి చిరాగ్గా తయారైంది అనే కామెంట్స్ ఇప్పుడు నెటిజెన్స్ నుండి వినిపిస్తున్నాయి. సన్నబడితే ఆఫర్స్ వస్తాయి అనుకుందో, ఏమో.. బరువు కరిగించేసి గ్లామర్ డాల్ గా మారిపోయింది. కానీ మోహంలో కళాకాంతి అన్నీ మిస్ చేసుకుంది.

Mehreen who became thin and lost her beauty:

Mehreen Kaur shocking look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs